Viral Video: భూమి మీద నూకలు మిగిలే ఉన్నాయి వీరికి.. క్షణాల్లో మృత్యువు నుంచి తప్పించుకున్నారు.. వీడియో వైరల్
Uttarakhand Landslide: వీరికి భూమి మీద నూకలు మిగిలి ఉన్నాయి. క్షణాల్లోనే మృత్యువు నుంచి తప్పించుకున్నారు. ఎవరికైనా జీవితంలో బతకాలని రాసివుంటే ఎంతటి ప్రమాదం పొంచివున్నా.. బతికి బయట పడతారు..
Uttarakhand Landslide: వీరికి భూమి మీద నూకలు మిగిలి ఉన్నాయి. క్షణాల్లోనే మృత్యువు నుంచి తప్పించుకున్నారు. ఎవరికైనా జీవితంలో బతకాలని రాసివుంటే ఎంతటి ప్రమాదం పొంచివున్నా.. బతికి బయట పడతారు. ఇలాంటి ఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. తాజాగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగి పడుతుండగా, ఇద్టరు వ్యక్తులు తృటిలో తప్పించుకున్న ఓ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలు హృదయాలను కదిలిస్తున్నాయి. రిషికేష్-చంబా జాతీయ రహదారిలో కొండచరియలు విరిగిపడిన సమయంలో ఇద్దరు స్కూటీ రైడర్లు తృటిలో తప్పించుకున్నారు. కొండచరియల నుంచి రాళ్లు పడుతున్న సమయంలో ఆ ఇద్దరు వ్యక్తులు స్కూటీపై ఆ రహదారి గుండా వెళ్తున్నారు. కొన్ని సెకన్ల సమయంలోనే వారు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. లేకపోతే కొండచరియల కింద నలిగిపోయే ప్రమాదం ఉండేది. వీరు బైక్ పై వస్తుండగా, అదే సమయంలో కొండ చరియలు విరిగి పడుతుండటం చూసిన కొందరు వారు చనిపోయారని అనుకున్నారు. కానీ ప్రమాదం నుంచి తప్పించుకుని బతికి బయటపడ్డారు ఆ ఇద్దరు వ్యక్తులు. కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాన్ని ఇతరులు తమ కెమెరాలో బంధించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ సమయంలో కొందరు తీసిన వీడియోలో కొండచరియల నుంచి రాళ్లు పడుతున్న దృశ్యాలను చూడవచ్చు. ఈ ఘటన కారణంగా ఒక రహదారి పూర్తిగా మూసివేయబడింది.
కాగా, ఇలా కొండచరియలు విరిగి పడటం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరిగాయి. భారీ వర్షాల కారణంగా కొండపై ఉన్న రాళ్లు పడటం వల్ల కొండచరియల్లో ఎంతో మంది చిక్కుకున్న సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇలా కొండచరియలు విరిగి పడటం కారణంగా రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.