Bandla Ganesh: ఇండిపెండెంట్‌గా బరిలోకి బండ్ల.. స్పందించిన జీవిత, ప్రకాశ్‌రాజ్‌.. అంతుచిక్కని వ్యూహాలతో ఉత్కంఠ

మా ఎన్నికలు జనరల్‌ ఎలక్షన్స్‌కి మించిన హీట్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. రోజుకో ట్విస్టు...ఊహించని స్క్రీన్‌ప్లే...అంతుచిక్కని వ్యూహాలు...మా కథా చిత్రమ్‌గా సాగుతోంది.

Bandla Ganesh: ఇండిపెండెంట్‌గా బరిలోకి బండ్ల.. స్పందించిన జీవిత, ప్రకాశ్‌రాజ్‌.. అంతుచిక్కని వ్యూహాలతో ఉత్కంఠ
Maa Elections
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 05, 2021 | 8:48 PM

మా..లో మళ్లీ రగడ మొదలైంది. బండ్లగణేష్‌ యూ టర్న్‌ టాలీవుడ్‌లో హాట్‌ టాఫిక్‌గా మారింది. ఇన్నాళ్లూ ప్రకాశ్‌రాజ్‌కి మద్దతిచ్చిన గణేష్‌.. ప్యానెల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మోనార్క్‌ ప్యానల్లోకి జీవితా ఎంట్రీ తనకి నచ్చలేదన్నారు. ఆమెకు వ్యతిరేకంగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. సంచనాలకు మారుపేరైనా బండ్ల గణేష్‌..యూ టర్న్‌ తీసుకున్నారు. మూవీ ఆర్టీస్ట్‌ అసోసియేషన్‌లో పోటీ చేస్తానంటూ కొత్త పోరుకు తెరలేపారు. ఇన్నాళ్లూ ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా పనిచేసిన ఆయన..ఆ ప్యానెల్‌ నుంచి బయటకొస్తున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్‌కు గురిచేశారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లోకి జీవితా రాజశేఖర్‌ రావడం తనకిష్టంలేదన్నారు బండ్ల గణేష్‌. తనకు ఇష్టమైన మెగా ఫ్యామిలీని ఆమె ఎన్నోసార్లు కించపరిచారన్నారు. అందుకే ఈ ప్యానల్‌ నుంచి తప్పుకొని..ఆమెపై జనరల్‌ సెక్రటరీ పదవి కోసం బరిలోకి దిగుతానంటూ వరుస ట్వీట్లు చేశారాయన. తానూ మాట తప్పను..మడమ తిప్పనని..ఒకే మాట-ఒకే బాట అని చెప్పారు బండ్ల గణేష్‌. నమ్మినవారి కోసం బతకడం..తన మనస్సాక్షి చెప్పినట్లు నడుచుకోవడం తనకి అలవాటన్నారు. జనరల్‌ సెక్రటరీగా పోటీ చేసి ఘన విజయం సాధిస్తానని చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక పేద కళాకారుల కోసం పనిచేస్తానన్నారు. వారి సొంతింటి కల నిజం చేస్తానన్నారు బండ్ల గణేష్‌.

బండ్ల గణేష్‌ వ్యాఖ్యలపై సినీ నటి జీవితా రాజశేఖర్‌ స్పందించారు. బండ్లగణేశ్‌తో తనకెలాంటి విభేదాలు లేవన్నారు ఆమె. తనపై వ్యతిరేకంగానో, నెగటివిటీతోనో ఆయన పోటీ చేస్తున్నారని తాను అనుకోవడం లేదన్నారు. తామంతా ఒక్కటేనన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచినా లేదా ఓడినా..మా కోసం పనిచేస్తానన్నారు జీవితా రాజశేఖర్‌.  బండ్లగణేష్‌ ఎన్నికల్లో బరిలోదిగే విషయంపై టీవీ9 లైవ్‌ డిబెట్‌లో ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు. అది బండ్ల గణేష్‌ పర్సనల్‌ విషయమని చెప్పుకొచ్చారు. మనస్సు చంపుకొని పనిచేయాలని ఎవ్వరూ చెప్పరన్నారు.

మొత్తానికి మా ఎన్నికలు జనరల్‌ ఎలక్షన్స్‌కి మించిన హీట్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. రోజుకో ట్విస్టు…ఊహించని స్క్రీన్‌ప్లే…అంతుచిక్కని వ్యూహాలు…మా కథా చిత్రమ్‌గా సాగుతోంది. మా ఎన్నికల లొల్లి ఎంతవరకూ వెళ్తుందో వేచి చూడాలి.

Also Read: టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా…?

దిశ ఘటనలో ఊహించని ట్విస్ట్… బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన 38 మంది సినీ ప్రముఖులపై కేసు

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్