Bigg Boss 5 – Lahari: బిగ్ బాస్ హౌస్‌లోని ఆ గుంట నక్క ఎవరు? బయటపెట్టేసిన లహరి.. టైటిల్ విన్నర్ ఆ ఇద్దర్లో ఒకరు..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్స్ సరయు, ఉమాదేవి, లహరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss 5 - Lahari: బిగ్ బాస్ హౌస్‌లోని ఆ గుంట నక్క ఎవరు? బయటపెట్టేసిన లహరి.. టైటిల్ విన్నర్ ఆ ఇద్దర్లో ఒకరు..
Bigg Boss 5
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 28, 2021 | 7:15 AM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్స్ సరయు, ఉమాదేవి, లహరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ముగిసింది. లోబో, నటరాజ్, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, అనీలు నామినేషన్స్‌లో నిలిచారు. బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం 16 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. వీరిలో సగం మంది(8) నామినేషన్స్‌లో నిలిచారు. ఇక నేరుగా విషయానికి వస్తే.. నటరాజ్ మాస్టర్ చెబుతున్న హౌజ్‌లోని ఆ గుంట నక్క ఎవరు? అన్న ప్రశ్న బిగ్ బాస్ వీక్షకుల్లో ఆసక్తిరేపుతోంది. ఆ గుంట నక్క ఎవరో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ లహరి బయటపెట్టేశారు.

హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారితో  అరియానా గ్లోరీ..బిగ్ బాస్ బజ్‌ పేరుతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మూడో వారం ఎలిమినేట్ అయిన లహరితో అరియానా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంలో నటరాజ్ మాస్టర్ చెబుతున్నఆ గుంట నక్క ఎవరు? అని అరియానా ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చిన లహరి.. అది రవినే అని వెల్లడించారు. ఆ విషయంలో హౌస్‌లోని అందరికీ తెలుసని..  అందరూ నవ్వుతూ మాట్లాడుకున్నట్లు చెప్పుకొచ్చారు.

కాగా బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్ ఎవరయ్యే అవకాశముందన్న ప్రశ్నకు కూడా లహరి సమాధానమిచ్చారు.  విశ్వ, శ్వేతా‌లో ఎవరో  ఒకరు టైటిల్ విన్నర్ కావచ్చని లహరి అభిప్రాయపడ్డారు. తాను కూడా అదే కోరుకుంటానని చెప్పారు. విశ్వ టాస్క్‌లు బాగా ఆడుతారని చెప్పారు. శ్వేతాలోని గుడ్ క్వాలిటీస్ గురించి చెబుతూ.. ఆమె ఎవరినీ హర్ట్ చేయదని, హర్ట్ చేస్తే వారికి క్షమాపణ చెప్పడానికి వెనకాడరని అన్నారు. అలాగే హైస్‌మేట్స్‌లో ఎవరినీ ఇన్‌ఫ్లుయన్స్ చేయడానికి ప్రయత్నించదన్నారు.

ప్రియ, రవికి పంచ్‌లు ఇవ్వాలనుకుంటున్నట్లు లహరి చెప్పారు. వారిద్దరి మాట్లాడిన తీరు తనకు నచ్చలేదన్నారు. వయస్సు ముఖ్యంకాదు.. ఎలా మాట్లాడుతున్నామన్నది ఇంపార్టెంట్ అన్నారు. ప్రియను ఎప్పటికీ సిస్టర్‌గానే భావిస్తానని.. అయితే ఆమె మాటలు తనను చాలా హర్ట్ చేశాయన్నారు. సిస్టర్‌గా భావించినంత మాత్రాన వారు చేసిన తప్పులు సరికావన్నారు. ఆ రోజు తన విషయంలో ఆమె ప్రతి మాటా తప్పుగానే మాట్లాడారని అన్నారు. ప్రియ అలా మాట్లాడేలా ప్రవోగ్ చేసింది రవి కాబట్టి.. తనకు కూడా పంచ్ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు.

షణ్ముఖ్, సిరి, కాజల్, హమిద హౌస్‌లో ఇతరులను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ.. ఇన్‌ఫ్లుయెన్స్ అవుతూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని అభిప్రాయపడ్డారు. సిరి షణ్నును ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ.. ఎమోషనల్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. కాజల్ షో ఆఫ్ గేమ్ ప్లే చేస్తున్నట్లు చెప్పారు.

తాను సహజంగా అందరినీ హగ్ చేసుకుంటానని.. దీనిపై మరోరకమైన అర్థాలుతీయడం సరికాదన్నారు. ఈ విషయంలో ప్రేక్షకులే న్యాయనిర్ణేతలుగా విడిచేస్తున్నట్లు లహరి చెప్పారు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే