Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour: అందాల గోవాలో సరదాగా తిరిగివద్దామని అనుకుంటున్నారా? ఐఆర్సీటీసీ గ్లోరియస్ టూర్ ప్యాకేజీ మీకోసమే!

సరదాగా తిరిగి రావాలనుకునే వారు ఎక్కువగా ఇష్టపడే ప్రదేశం గోవా. భారత్ లోని టూరిస్ట్ ప్రాంతాలలో గోవా రూటే సపరేటు. ప్రయాణాలు చేయడానికి ఇష్టపడేవారికి గోవా ఎప్పుడూ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

IRCTC Tour: అందాల గోవాలో సరదాగా తిరిగివద్దామని అనుకుంటున్నారా? ఐఆర్సీటీసీ గ్లోరియస్ టూర్ ప్యాకేజీ మీకోసమే!
Irctc Tour Glorius Goa
Follow us
KVD Varma

|

Updated on: Sep 28, 2021 | 3:56 PM

IRCTC Tour: సరదాగా తిరిగి రావాలనుకునే వారు ఎక్కువగా ఇష్టపడే ప్రదేశం గోవా. భారత్ లోని టూరిస్ట్ ప్రాంతాలలో గోవా రూటే సపరేటు. ప్రయాణాలు చేయడానికి ఇష్టపడేవారికి గోవా ఎప్పుడూ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. గోవా సహజ సౌందర్యం, సంస్కృతి, అక్కడి సుందరమైన బీచ్‌లు దేశీయ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షిస్తాయి. కొత్తగా పెళ్లైన జంటల కోసం సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి గోవా. మీరు రాబోయే కొద్ది రోజుల్లో గోవాను సందర్శించాలనుకుంటే, ఐఆర్సీటీసీ మీ కోసం అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఐఆర్సీటీసీ (IRCTC) ఈ గోవా టూర్ ప్యాకేజీకి ‘గ్లోరియస్ గోవా X ముంబై’ అని పేరు పెట్టింది. ఈ టూర్ ప్యాకేజీ గురించి తెలుసుకుందాం.

ప్రయాణం ఇలా..

ఐఆర్సీటీసీ గోవా టూర్ ప్యాకేజీ ముంబయి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఐఆర్సీటీసీ కొంకణ్ కన్యా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి శుక్రవారం ముంబై సీఎస్టీ రైల్వే స్టేషన్ నుండి రాత్రి 11:05 గంటలకు మూడు రాత్రి.. నాలుగు రోజుల గోవా పర్యటన కోసం బయలుదేరుతుంది. రాత్రిపూట ప్రయాణం తరువాత, ప్రయాణీకులు మరుసటి రోజు ఉత్తర గోవాలోని తివిమ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రయాణీకులను హోటల్‌కు తీసుకెళ్తారు.

ఆ తర్వాత, ప్రయాణీకులకు ఉత్తర గోవా సందర్శనా స్థలానికి చేరుస్తారు. ఉత్తర గోవాలో పర్యాటకులు అగ్వాడా ఫోర్ట్, కాండోలిమ్ బీచ్, బాఘా బీచ్, అంజునా బీచ్, డోనా పౌలా, కలంగూట్ బీచ్ వంటి ప్రదేశాలను చూడవచ్చు. దీనిని ‘క్వీన్ ఆఫ్ ది సీ బీచ్’ అని పిలుస్తారు. దీని తరువాత, రాత్రి భోజ, రాత్రి విశ్రాంతి తరువాత, ప్రయాణీకులను మరుసటి రోజు దక్షిణ గోవాకు తీసుకువెళతారు.

దక్షిణ గోవాలో అల్పాహారం తర్వాత, మీరామర్ బీచ్, పాత గోవా చర్చి, మంగేషి ఆలయం వంటి ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా, ప్రయాణికులు మాండోవి నదిలో క్రూయిజ్ ప్రయాణాన్ని కూడా ఆస్వాదించవచ్చు. దీని తర్వాత ప్రయాణీకులను హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్‌లో రాత్రి భోజనం, రాత్రి విశ్రాంతి తర్వాత, మరుసటి రోజు ఉదయం అల్పాహారం తర్వాత, ప్రయాణీకులు తివిమ్ రైల్వే స్టేషన్ నుండి ముంబయి తిరుగు ప్రయాణం అవుతారు.

ప్యాకేజీలో ఏమి ఉంటాయంటే..

ఈ పర్యటనలో, ముంబయి నుంచి గోవా వెళ్లడానికి, తిరిగి రావడానికి థర్డ్ ఏసీ, సెకండ్ స్లీపర్ క్లాస్ ఏర్పాట్లు ఉంటాయి. ప్రయాణీకులు కంఫర్ట్, స్టాండర్డ్ ఆప్షన్ ప్రకారం ఈ కోచ్‌లను ఎంచుకోవచ్చు. దీనితో పాటు, ప్రయాణీకులను రైల్వే స్టేషన్ నుండి హోటల్‌కు తీసుకురావడానికి, తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తారు. దీనితో పాటు, అన్ని సైట్‌లకు AC బస్సుల ఏర్పాటు ఉంటుంది.

ఈ ఐఆర్సీటీసీ ప్యాకేజీ ద్వారా గోవా వెళ్లిరావడానికి మీరు రూ .11,990 చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: Viral News: ‘ఎనర్జీ డ్రింక్స్’ తాగిన కొద్ది గంటల్లోనే స్పృహ తప్పింది.. తీరా స్కాన్ చేసి చూడగా గట్టి షాక్!

Punjab Politics: ఢిల్లీకి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. బీజేపీతో జట్టు కట్టడానికేనా?