Viral News: ‘ఎనర్జీ డ్రింక్స్’ తాగిన కొద్ది గంటల్లోనే స్పృహ తప్పింది.. తీరా స్కాన్ చేసి చూడగా గట్టి షాక్!

Viral News: మనం చేసే పని ఏదైనా కూడా అతిగా చేయకూడదు. మోతాదుకు మించి చేయడం వల్ల అనర్ధాలు వస్తాయని పెద్దలు చెబుతుంటారు. కూల్ డ్రింక్స్..

Viral News: 'ఎనర్జీ డ్రింక్స్' తాగిన కొద్ది గంటల్లోనే స్పృహ తప్పింది.. తీరా స్కాన్ చేసి చూడగా గట్టి షాక్!
Masha Viral News
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 28, 2021 | 3:41 PM

మనం చేసే పని ఏదైనా కూడా అతిగా చేయకూడదు. మోతాదుకు మించి చేయడం వల్ల అనర్ధాలు వస్తాయని పెద్దలు చెబుతుంటారు. కూల్ డ్రింక్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ మితంగా తాగాలి. వాటిని మోతాదుకు మించి తాగితే లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి స్విట్జర్లాండ్‌లో చోటు చేసుకుంది. స్విస్ దేశంలోని జ్యూరిచ్‌ నగరానికి చెందిన ఓ అమ్మాయికి ఎనర్జీ డ్రింక్స్ అంటే మహా ఇష్టం. కనీసం రోజుకు 12 ‘రెడ్ బుల్’ ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంది. ఈ అలవాటు కారణంగా ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ కథేంటో తెలుసుకుందాం పదండి..

మిర్రర్ అనే వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన కథనం ప్రకారం.. జ్యూరిచ్‌కు చెందిన 17 ఏళ్ల మాషా అనే అమ్మాయికి ఎనర్జీ డ్రింక్స్ తాగడం అంటే చాలా ఇష్టం. ఇక ఈ అలవాటు ఆమెకి ఒక వ్యసనంగా మారింది. దీనితో రోజూ 12 ‘రెడ్ బుల్’ డ్రింక్స్‌ను తాగడం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని మాషానే స్వయంగా వెల్లడించింది. ఇదే అలవాటును కొనసాగించిన మాషా.. అకస్మాత్తుగా ఓ రోజు పాఠశాలలో వ్యాయామం చేస్తూ స్పృహ తప్పి పడిపోయింది.

దీనితో స్కూల్ యాజమాన్యం ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించగా.. చెకప్ చేసిన డాక్టర్లు.. మాషా గుండె సంబంధిత వ్యాధి(Heart Cramps)తో బాధపడుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా మాషా అతిగా తాగే ఎనర్జీ డ్రింక్స్ వల్లే ఈ వ్యాధి సోకినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని టిక్ టాక్ వీడియో ద్వారా తన యూజర్లతో పంచుకున్న మాషా.. ”ఎనర్జీ డ్రింక్స్‌ను ఎక్కువగా అలవాటు చేసుకోవద్దునని.. రోజూ సిగరెట్లు, ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల తాను ఇలా హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చిందని” ఆమె చెప్పుకొచ్చింది.

Also Read:

ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి చూద్దాం.. వేటాడేందుకు దాగుంది.. పజిల్ కొంచెం కష్టమే.!

సాండ్‌విచ్ తినడానికి వెళ్లిన కస్టమర్‌కు గట్టి షాక్.. హోటల్ సిబ్బంది చేసిన పనికి వావ్ అనాల్సిందే!

 సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ జట్టుకు డేవిడ్ భాయ్ గుడ్ బై.?