Viral video : మేక పై సవారీ చేసిన కోతి పిల్ల .. నెటిజన్ల మనసు దోచుకుంటున్న వీడియో..
సోషల్ మీడియా.. ఈ ఒక్కటి అందుబాటులో ఉంటే చాలు దునియా మన చేతిలో ఉన్నట్టే.. ప్రపంచం నలుమూలల ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మన ముందు ప్రత్యక్షం అవుతుంది.
Viral video : సోషల్ మీడియా.. ఈ ఒక్కటి అందుబాటులో ఉంటే చాలు దునియా మన చేతిలో ఉన్నట్టే.. ప్రపంచం నలుమూలల ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మన ముందు ప్రత్యక్షం అవుతుంది. ఇక నెట్టింట వింతైన వీడియోలు చాలానే దర్శనమిస్తుంటాయి.. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తుంటాయి.. జంతువులకు సంబంధించిన వీడియోలు కడుపుబ్బా నవ్విస్తుంటాయి.. ఈ వీడియో కూడా అలాంటిదే.. కోతులు చేసే పనులు చాల విచిత్రంగా అనిపిస్తుంటాయి. కోతి- మేక కలిసి బెర్రీలు తింటున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది అడవిలో ఓ వ్యక్తి చేతిలో బెర్రీసి పట్టుకొని మేకను పిలుస్తాడు. అతడి పిలుపు విని మేక అడవి నుండి బయటకు వచ్చి అతని వైపు పరిగెత్తింది. ఆశ్చర్యకరంగా, ఒక పిల్ల కోతి దాని మెడకు వేలాడుతూ కనిపిస్తుంది. మేక పై సవారీ చేసుకుంటూ అక్కడికి చేరుకుంటుంది కోతి. ఆతర్వాత అతడి చేతిలో ఉన్న బెర్రీలను మేక- కోతి తినడం ప్రారంభిస్తాయి. వీటిలో మొదట మేక, వాటిని ఒక్కొక్కటిగా తినడం ప్రారంభిస్తుంది. కానీ కోతి కాస్త గందరగోళంగా ఉంది. కొద్దిసేపటి తరువాత, కోతి కూడా చేరి బెర్రీని తినడం మొదలు పెట్టింది. టెస్ట్ నచ్చిందనుకుంటా మేక పైకి ఎక్కి మరీ బెర్రీలను లాగించింది కోతి. ఇప్పుడు ఈవీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
రెండు చిన్న జంతువుల మధ్య అద్భుతమైన స్నేహాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు, ఈ వీడియోను ట్విట్టర్‌లో 12 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. అలాగే 534,000 లైక్‌లను సొంతం చేసుకుంది ఈ వీడియో. అంతే కాదు 105,000 కంటే ఎక్కువ సార్లు ఈ వీడియోను రీట్వీట్ చేశారు నెటిజన్లు.
Am I high right now what is happening pic.twitter.com/itBaV1XUNK
— Kristi Yamaguccimane (@wapplehouse) September 26, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :