Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

David Warner: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ జట్టుకు డేవిడ్ భాయ్ గుడ్ బై.?

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2021 సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అస్సలు అచ్చిరాలేదని చెప్పాలి. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లు ఆడగా.. అందులో రెండింటిలో మాత్రమే..

David Warner: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ జట్టుకు డేవిడ్ భాయ్ గుడ్ బై.?
David Warner
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 28, 2021 | 11:40 AM

ఐపీఎల్ 2021 సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అస్సలు అచ్చిరాలేదని చెప్పాలి. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లు ఆడగా.. అందులో రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా సన్‌రైజర్స్ నిష్క్రమించింది. ఇదిలా ఉంటే నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ స్థానంలో జేసన్ రాయ్ తుది జట్టులోకి వచ్చి అదరగొట్టాడు. ఇక అదే సమయంలో డేవిడ్ భాయ్ స్టేడియంలో కనిపించకపోవడం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌ను బాధపెట్టింది. ఇకపై ఆరెంజ్ జెర్సీలో వార్నర్‌ను చూస్తామో లేదో అంటూ కామెంట్స్ చేశారు.

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో వార్నర్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. మొదట అతడు కెప్టెన్సీ నుంచి వైదొలగగా.. ఆ తర్వాత జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. ఇక కొద్దిరోజుల్లో మెగా ఆక్షన్ జరగనుండగా.. వార్నర్‌ను ఇకపై ఆరెంజ్ జెర్సీలో చూడలేమని సన్‌రైజర్స్ అభిమానులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వార్నర్ తాజాగా ఓ నెటిజన్‌కు ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ”తనను మళ్లీ ఎస్‌ఆర్‌హెచ్ క్యాంపులో చూడలేరని.. అయినా జట్టుకు సపోర్ట్ చేస్తూనే ఉండండి” వార్నర్ రిప్లయ్ ఇచ్చాడు. దీనితో ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు వార్నర్ మొత్తానికి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.

అటు సన్‌రైజర్స్ జట్టు హెడ్ కోచ్ ట్రెవర్ బేలిస్ ”ఇంతవరకు ఆ(వార్నర్) అంశం గురించి ఆలోచించలేదు. మెగా ఆక్షన్ తొందర్లోనే జరగనుంది. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఎన్నో ఏళ్లుగా వార్నర్ జట్టుకు ఎనలేని సేవలు అందించాడు. మా అందరికీ కూడా అతడిపై గౌరవం ఉంది. ఈ మ్యాచ్‌(రాజస్థాన్)కు యువ ఆటగాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నాం. అందుకే కొంతమంది హోటల్‌కే పరిమితమయ్యారు” అంటూ పేర్కొనడం ఈ వ్యాఖ్యలకు బలాన్ని చేకురిస్తోంది. ఒక్క సీజన్ ఫెయిల్ అయితే.. ఛాంపియన్‌ను ఇలా పక్కన పెట్టేస్తారా.? ఇన్నేళ్లుగా అతడు చేసిన సేవలు మర్చిపోయారా.? అంటూ వార్నర్ ఫ్యాన్స్ ఫ్రాంచైజీ తీరును విమర్శిస్తున్నారు. కాగా, 2016లో వార్నర్ సారధ్యంలోనే హైదరాబాద్ జట్టు తొలి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.