Virat Kohli: స్విమింగ్ ఫుల్లో ఆర్సీబీ ఆటగాళ్లు.. వైరల్‌గా మారిన విరాట్ ఫొటోలు
విరాట్ కోహ్లీ ప్రపంచంలో మేటి బ్యాట్స్‌మెన్స్‌లో ఒక్కరు. అతని ఆటతో భారత్‌కు ఎన్ని విజయాలను అందించారు...
విరాట్ కోహ్లీ ప్రపంచంలో మేటి బ్యాట్స్‌మెన్స్‌లో ఒక్కరు. అతని ఆటతో భారత్‌కు ఎన్ని విజయాలను అందించారు. విరాట్ ఆటకే కాకుండా ఫిట్‌నెస్‌కు కూడా చాలా ప్రాధాన్యం ఇస్తారు. కోహ్లీ ఆటకే కాకుండా అతని అత్యన్నత శరీరాకడతికి, ఫిట్‌నెస్‌కు ప్రశంసలు అందుకుంటున్నారు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరుకు నాయకత్వం వహిస్తున్న అతను జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ రెండో దశలో ఆర్సీబీ రెండు వరుస ఓటముల తర్వాత ముంబైపై విజయం సాధించి గాడిలో పడింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 51 పరుగులు చేశారు. ఈ గెలుపుతో ఊపు మీద ఉన్న బెంగళూరు ఆటగాళ్లు ఈత కొలనులో సరదాగా గడిపారు. ఈత కొలనులో విరాట్‌తో పాటు సహచర ఆటగాళ్లు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా కోహ్లీ ఫొటోలపై నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు.
బెంగళూరు ఫ్రాంచైజీ తమ కెప్టెన్ కోహ్లీ మరింత దూకుడుగా ఉండాలని కోరుకుంటున్నట్లు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, ఆర్సీబీ బౌలర్ డేల్ స్టెయిన్ అన్నారు. విరాట్‌ను అందరు గౌరవిస్తారని.. అతనిని ఎంతగానో ఆరాధిస్తారని స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ డగౌట్‌లో స్టెయిన్ చెప్పారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సీరిస్‌లో కోహ్లీ బాగా ఆడారని అన్నారు. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించారని చెప్పుకొచ్చారు. ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతారని ఇదీ తాను డ్రెసింగ్ రూంలో చూశాసని తెలిపారు.
రెండో దశలో మూడు మ్యాచులు ఆడిన కోహ్లీ రెండు అర్థసెంచరీలు చేశాడు. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఐపీఎల్-2021లో పది మ్యాచులు ఆడి ఆరింటిలో విజయం సాధించింది. నాలుగింటిలో ఓడిపోయింది.
Our boys definitely deserve to cool off after a couple of days of intense #IPL action. ??♂️ #PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/SNNMwIvxtJ
— Royal Challengers Bangalore (@RCBTweets) September 27, 2021
Read also.. David Warner: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ జట్టుకు డేవిడ్ భాయ్ గుడ్ బై.?