KKR vs DC Highlights, IPL 2021: మూడు వికెట్ల తేడాతో కోల్‌కతా ఘన విజయం.. అన్ని రంగాల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విఫలం

Venkata Chari

|

Updated on: Sep 28, 2021 | 7:26 PM

KKR vs DC Highlights in Telugu:128 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేరుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

KKR vs DC Highlights, IPL 2021: మూడు వికెట్ల తేడాతో కోల్‌కతా ఘన విజయం.. అన్ని రంగాల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విఫలం
Ipl 2021 Kkr Vs Di 41st Match

KKR vs DC Live Score in Telugu:కోల్‌కతా టీం అన్ని రంగాల్లో అద్బుత ప్రతిభ చూపి ఢిల్లీ క్యాపిటల్స్ టీంపై విజయం సాధించింది. అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్‌మెన్ల ధాటికి ఢిల్లీ టీం ఏదశలోనూ కోలుకోలేకపోయింది. 128 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేరుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శుభ్మన్ గిల్ 30, వెంకటేష్ అయ్యర్ 14, రాహుల్ త్రిపాఠి 9, నితీష్ రాణా 36 నాటౌట్, మోర్గాన్ 0, దినేష్ కార్తీక్ 12, సునీల్ నరైన్ 21 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో అవేష్ ఖాన్ 3, అన్‌రిచ్, అశ్విన్, లలిత్, రబాడా తలో వికెట్ పడగొట్టారు.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా ముందు 128 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఆటకు పూర్తి భిన్నంగా ఆడింది. దీనికి కారణం కోల్‌కతా నైట్ రైడర్స్ టీం బౌలర్లు. అద్భుతంగా బౌలింగ్ చేసి వరుసగా వికెట్లు తీస్తూ ఢిల్లీ బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించారు. 

ఐపీఎల్ ద్వితీయార్ధంలో సరిసమానమైన రెండు జట్లు టోర్నమెంట్‌లో 41 వ మ్యాచ్‌లో పరస్పరం తలపడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ టీంల మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ టీం 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు కోల్‌కతా టీం 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. రెండో దశలో ఇప్పటి వరకు ఢిల్లీ టీం రెండు మ్యాచులాడి రెండిట్లో గెలుపొందింది. హ్యాట్రిక్ విజయం కోసం ఎదరుచూస్తోంది. మరోవైపు కోల్‌కతా టీం మూడు మ్యాచులు ఆడి రెండు విజయాలు సాధించింది.

ఇప్పటి వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ టీం ఢిల్లీ క్యాపిటల్స్‌తో 27 మ్యాచులు ఆడారు. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ 14, ఢిల్లీ క్యాపిటల్స్‌ 12 మ్యాచుల్లో విజయం సాధించారు. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు.

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శిఖర్ ధావన్, స్టీవెన్ స్మిత్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), షిమ్రాన్ హెట్మీర్, లలిత్ యాదవ్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడ, అన్రిచ్ నార్త్జే, అవేష్ ఖాన్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శుభ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), నితీష్ రాణా, దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ, వరుణ్ చాకరవర్తి, సందీప్ వారియర్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 28 Sep 2021 07:12 PM (IST)

    కోల్‌కతా నైట్‌రైడర్స్‌దే విజయం

    128 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కేవలం 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేరుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

  • 28 Sep 2021 06:42 PM (IST)

    14 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 96/4

    14 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 4 వికెట్లు నష్టపోయి 96 పరుగులు చేసింది. క్రీజులో కార్తీక్ 12, రాణా 29 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 14వ ఓవర్‌లో 2 సిక్సులు, 1ఫోర్‌తో మొత్తం 20 పరుగులు రాబట్టుకున్నారు.

  • 28 Sep 2021 06:28 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    ఇయాన్ మోర్గాన్ (0) రూపంలో కోల్‌కతా టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో టీం స్కోర్ 67 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

  • 28 Sep 2021 06:26 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    శుభ్మన్ గిల్ (30) రూపంలో కోల్‌కతా టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. రబాడా బౌలింగ్‌లో టీం స్కోర్ 67 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

  • 28 Sep 2021 06:02 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    రాహుల్ త్రిపాఠి (9) రూపంలో కోల్‌కతా టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో టీం స్కోర్ 43 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

  • 28 Sep 2021 05:55 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    వెంకటేష్ అయ్యర్ (12) రూపంలో కోల్‌కతా టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. లలిత్ యాదవ్ వేసిన అద్భుత స్పిన్‌కు బౌల్డయ్యాడు.

  • 28 Sep 2021 05:49 PM (IST)

    3 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 22/0

    3 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్ రైడర్స్ టీం వికెట్లేమి నష్టపోకుండా 22 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్ 11, గిల్ 10 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 28 Sep 2021 05:40 PM (IST)

    మొదలైన కోల్‌కతా ఛేజింగ్

    128 పరుగుల లక్ష్యంతో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం బ్యాటింగ్ మొదలు పెట్టింది. ఓపెనర్లుగా వెంకటేష్ అయ్యర్, శుభ్యన్ గిల్ వచ్చారు.

  • 28 Sep 2021 05:25 PM (IST)

    కోల్‌కతా నైట్‌రైడర్స్ టార్గెట్ 128

    టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 128 పరుగులు చేయాల్సి ఉంది.

  • 28 Sep 2021 04:56 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ

    అక్షర్ పటేల్ (0) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఆరో వికెట్‌ను కోల్పోయింది. వెంకటేష్ అయ్యర్ బౌలింగ్‌లో టీం స్కోర్ 94 వద్ద పెవిలియన్ చేరాడు.

  • 28 Sep 2021 04:50 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ

    లలిత్ యాదవ్ (0) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. నరైన్ బౌలింగ్‌లో టీం స్కోర్ 89 వద్ద ఎల్బీగా వెనుదిరిగాడు.

  • 28 Sep 2021 04:43 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ

    హెట్ మెయిర్ (4) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. వెంకటేష్ అయ్యర్ బౌలింగ్‌లో టీం స్కోర్ 88 వద్ద సౌతీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 28 Sep 2021 04:35 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ

    స్మిత్ (39) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. ఫెర్గ్యూసన్‌ బౌలింగ్‌లో టీం స్కోర్ 77 వద్ద బౌల్డయ్యాడు.

  • 28 Sep 2021 04:23 PM (IST)

    10 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 64/2

    10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం రెండు వికెట్లు నష‌్టపోయి 65 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్ 31, పంత్ 7 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 28 Sep 2021 04:05 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ

    శ్రేయాస్ అయ్యార్ (1) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో టీం స్కోర్ 40 వద్ద బౌల్డయ్యాడు.

  • 28 Sep 2021 03:57 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ

    ధావన్ (24) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో టీం స్కోర్ 35 వద్ద వెంకటేష్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 28 Sep 2021 03:45 PM (IST)

    3 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 22/0

    3 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం వికెట్ నష‌్టపోకుండా 22 పరుగులు చేసింది. క్రీజులో ధావన్ 17, స్మిత్ 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 28 Sep 2021 03:33 PM (IST)

    మొదలైన ఢిల్లీ బ్యాటింగ్

    టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగింది ఢిల్లీ క్యాపిటల్స్ టీం. ఓపెనర్లుగా స్మిత్, ధావన్ బరిలోకి దిగారు.

  • 28 Sep 2021 03:07 PM (IST)

    ప్లేయింగ్ ఎలెవన్

    ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శిఖర్ ధావన్, స్టీవెన్ స్మిత్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), షిమ్రాన్ హెట్మీర్, లలిత్ యాదవ్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడ, అన్రిచ్ నార్త్జే, అవేష్ ఖాన్

    కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శుభ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), నితీష్ రాణా, దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ, వరుణ్ చాకరవర్తి, సందీప్ వారియర్

  • 28 Sep 2021 03:03 PM (IST)

    టాస్ గెలిచిన కేకేఆర్

    ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత రిషబ్ పంత్ టీం బ్యాటింగ్ చేయనుంది.

  • 28 Sep 2021 02:38 PM (IST)

    KKR vs DC హెడ్ టూ హెడ్

    ఇప్పటి వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ టీం ఢిల్లీ క్యాపిటల్స్‌తో 27 మ్యాచులు ఆడారు. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ 14, ఢిల్లీ క్యాపిటల్స్‌ 12 మ్యాచుల్లో విజయం సాధించారు. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు.

  • 28 Sep 2021 02:37 PM (IST)

    ఢిల్లీ జోరుకు కోల్‌కతా బ్రేకులు వేసేనా?

Published On - Sep 28,2021 2:36 PM

Follow us