MI vs PBKS, IPL 2021 Match Prediction: ప్లే ఆఫ్‌లో ప్లేస్ కోసం రోహిత్, రాహుల్ పోరాటం.. ఎవరి బలాలు ఎలా ఉన్నాయంటే?
Today Match Prediction of Mumbai Indians vs Punjab Kings: పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం కోసం ముంబయి ఇండయన్స్ టీంతో పంజాబ్ కింగ్స్ టీం తలడపనుంది.
Today Match Prediction of Mumbai Indians vs Punjab Kings: అత్యధిక సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్ టీం. ఈ సారి జరిగే సీజన్‌లో ఏమాత్రం పోటీ ఇవ్వకుండా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. ఐపీఎల్ 2021 ద్వితీయార్ధంలో, రోహిత్ శర్మ జట్టు ఈ రోజు తన మూడవ మ్యాచ్ ఆడనుంది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. రాహుల్ జట్టుకు ఇది కూడా మూడో మ్యాచ్. అయితే రెండింటి మధ్య ఉన్న పెద్ద వ్యత్యాసం ఏమిటంటే, పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2021 ఈ అర్ధభాగంలో చివరి 2 మ్యాచ్‌లలో ఒకదాన్ని గెలుచుకోగా, ముంబై ఇండియన్స్ ఇప్పటికీ తమ మొదటి విజయం కోసం చూస్తోంది. ఈ మ్యాచులో ముంబై టీం విజయం సాధించకపోతే ప్లే-ఆఫ్ రేసు నుంచి దాదాపుగా తప్పుకున్నట్లే. మరోవైపు పంజాబ్ కింగ్స్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. దీంతో ఇరు జట్లకు నేటి మ్యాచ్ ఎంతో కీలకమైంది.
ఎప్పుడు: ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్, సెప్టెంబర్ 28, 2021, రాత్రి 7:30 గంటలకు
ఎక్కడ: షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి
పిచ్: అబుదాబిలో పిచ్ మునుపటి సీజన్ వలె వేగంగా లేదు. సాయంత్రం ఆటలలో రెండవ బ్యాటింగ్ సౌకర్యవంతంగా ఉంటుంది.
MI vs PBKS హెడ్ టూ హెడ్ ఇప్పటి వరకు ఇరు జట్లు 27 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్ 14 సార్లు గెలిచింది. 13 మ్యాచ్‌లలో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు (Where and How to Watch) టీవీ – స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లైవ్ స్ట్రీమింగ్ – డిస్నీ+హాట్‌స్టార్
రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ 2021 లో ఆడిన చివరి మ్యాచ్‌లో పంజాబ్ జట్టుదే ఆధిపత్యం. గత 5 మ్యాచ్‌లను పరిశీలిస్తే.. పంజాబ్ కింగ్స్ 3-2తో ముంబైపై ఆధిక్యంలో ఉంది. రెండు జట్ల మధ్య ఐపీఎల్‌లో ఇప్పటివరకు 27 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్ 14 సార్లు గెలిచింది. 13 మ్యాచ్‌లలో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఈరోజు అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచులో విజయం సాధించేందుకు ఇరు జట్లు తీవ్రంగా ప్రయత్నిస్తాయని తెలుస్తుంది.
రెండు జట్ల విషయానికొస్తే, ముంబై ఇండియన్స్‌లో మార్పుకు తక్కువ అవకాశం ఉంటుంది. అలాగే పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI లో మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. మిడిల్ ఓవర్లలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఘోరంగా ఫ్లాప్ అయ్యారు. ముంబై బౌలింగ్ ఇప్పటివరకు బలంగా కనిపిస్తోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ బలంగా ఉంది. జట్టుకు అతిపెద్ద బలం కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ జంట. అలాగే పంజాబ్ బౌలింగ్‌లోనూ బలంగా తయారైంది.
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కిరాన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, ఆడమ్ మిల్నే, రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI అంచనా: కేఎల్ రాహుల్ (కీపర్, కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, హర్‌ప్రీత్ బ్రార్, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ, నాథన్ ఎల్లిస్, అర్షదీప్ సింగ్