Apple Smart Watch: వ్యక్తి ప్రాణాలు కాపాడిన యాపిల్ స్మార్ట్ ఫోన్.. మ్యాటర్ తెలిస్తే ఔరా అంటారు..!

Apple Watch: ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ఓ మోటార్ సైకిలిస్ట్‌‌ను యాపిల్ స్మార్ట్ వాచ్ కాపాడింది. ఆ స్మార్ట్ వాచ్ ఇచ్చిన సమాచారంతో సమయానికి..

Apple Smart Watch: వ్యక్తి ప్రాణాలు కాపాడిన యాపిల్ స్మార్ట్ ఫోన్.. మ్యాటర్ తెలిస్తే ఔరా అంటారు..!
Smart Watch
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 01, 2021 | 4:15 PM

Apple Watch: ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ఓ మోటార్ సైకిలిస్ట్‌‌ను యాపిల్ స్మార్ట్ వాచ్ కాపాడింది. ఆ స్మార్ట్ వాచ్ ఇచ్చిన సమాచారంతో సమయానికి అతన్ని ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సింగపూర్‌లోని ఆంగ్ మో కియో ప్రాంతంలో మహ్మద్ ఫిత్రి(24) అనే మోటార్ సైకిలిస్ట్ రోడ్డుపై వెళ్తుండగా.. ఓ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫిత్రి ఎగిరి చెట్ల పొదల్లో పడిపోయాయి. అయితే, ఫిత్రి యాపిల్ సిరీస్ 5 స్మార్ట్ వాచ్‌ను ధరించాడు. ఇందులో అత్యాధునిక ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఉంది. అది ధరించిన వారు.. ఏదైనా ప్రమాదానికి గురైతే వెంటనే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కి సమాచారం అందిస్తుంది.

ఫిత్రి కిందపోవడాన్ని యాపిల్ వాచ్ గుర్తించింది. మొదట హార్డ్ ఫాల్ వార్నింగ్‌కు ఫిత్రి నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో.. వాచ్ అలర్ట్ అయ్యింది. అప్పటికే ఆ స్మార్ట్ వాచ్‌లో ఫీడ్ చేసిన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కి, అత్యవసర సేవల నెంబర్లకు సందేశం పంపింది. వెంటనే అలర్ట్ అయిన ఆ దేశ భద్రతా సిబ్బంది.. ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో నిర్మానుష్య ప్రాంతంలో పడి ఉన్న ఫిత్రిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

ఇక ఇలాంటి ఘటనే అమెరికాలోనూ చోటు చేసుకుంది. యూఎస్‌లోని నార్త్ కరోలినాకు చెందిన 78 ఏళ్ల వ్యక్తి ప్రమాదానికి గురవడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. అతని చేతికి కూడా యాపిల్ స్మార్ట్ వాచ్ ఉంది. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు గుర్తించిన వాచ్.. వెంటనే సహాయం కోరుతూ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కి సందేశం పంపింది. ఇక మరో యువకుడి ఆరోగ్య పరిస్థితిని సైతం యాపిల్ వాచ్ పసిగట్టింది. ప్రాణాపాయం ఉందంటూ వార్నింగ్ అలర్ట్ ఇవ్వడంతో.. ఆ యువకుడు ఆస్పత్రిలో టెస్టులు చేయించుకున్నాడు. పుర్రెలో ఫ్రాక్చర్, మల్టిపుల్ హెమటోమాలు కనిపించాయి. దాంతో అతను బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఇలా యాపిల్ స్మార్ట్ ఫోన్.. చాలా మంది ప్రాణాలను కాపడటంతో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఇక యాపిల్ వాచ్‌ సిరీస్ 4లోనూ ఫాల్ డిటెక్షన్ ఫీచర్‌ను పరిచయం చేశారు. గుండె ఆరోగ్యం, రక్తంలో ఆక్సీజన్ స్థాయిలు, ఫిట్‌నెస్ తదితర అంశాలను పసిగట్టే టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు.

Also read:

Anupama Parameswaran : బికినీ ఫోటో అడిగిన నెటిజన్.. అనుపమ సమాధానం వింటే షాక్ అవుతారు.. ఇచ్చిపడేసిందిగా..

Republic Movie Review: ప్రతి ఒక్కరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే భవిష్యత్తు ప్రమాదమే..

Viral Video: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు.. ఒక్క పాము కోసం మరో మూడు పాములు.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..