AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Republic Movie Review: ప్రతి ఒక్కరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే భవిష్యత్తు ప్రమాదమే..

లవ్‌ స్టోరీని ఫాలో అవుతూ రిలీజ్‌ అయిన రిపబ్లిక్‌ మూవీ కూడా అంతే సందడిని తెచ్చిపెడుతుందా?

Republic Movie Review: ప్రతి ఒక్కరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే భవిష్యత్తు ప్రమాదమే..
Republic Movie
Janardhan Veluru
|

Updated on: Oct 01, 2021 | 3:59 PM

Share

Sai Dharam Tej’s Republic Movie Review: లాస్ట్ వీక్‌ లవ్‌ స్టోరీ రిలీజ్‌ అనగానే థియేటర్లన్నీ కిటకిటలాడిపోయాయి. ఫస్ట్ డే మార్నింగ్‌ షోలన్నీ ఫుల్‌ అయ్యాయి. బ్యాక్‌ టు నార్మల్‌ అంటూ సినీ జనాల్లోనూ మంచి సందడి కనిపించింది. లవ్‌ స్టోరీని ఫాలో అవుతూ రిలీజ్‌ అయిన రిపబ్లిక్‌ మూవీ కూడా అంతే సందడిని తెచ్చిపెడుతుందా?

సినిమా: రిపబ్లిక్‌ నటీనటులు: సాయిధరమ్‌తేజ్‌, ఐశ్వర్య రాజేష్‌, జగపతిబాబు, రమ్యకృష్ణ, రాహుల్‌ రామకృష్ణ, సురేఖ వాణి, సుబ్బరాజు, ఫణి తదితరులు నిర్మాణ సంస్థ: జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్‌ దర్శకత్వం: దేవ్‌ కట్టా స్క్రీన్‌ప్లే: దేవ్‌ కట్టా, కిరణ్‌ జై కుమార్‌ కథ: దేవ్‌ కట్టా కెమెరా: సుకుమార్‌ ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌ సంగీతం: మణిశర్మ విడుదల: అక్టోబర్‌ 1, 2021

పంజా అభి (సాయిధరమ్‌తేజ్‌) ఫారిన్‌ వెళ్లాలనుకుంటాడు. అయితే అతని చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చూసి పారిన్‌ ట్రిప్‌ కేన్సిల్‌ చేసుకుంటాడు. సివిల్స్ ఇంటర్వ్యూకి అటెండ్‌ అయిన అతను.. సెలక్ట్ కానని అర్థం చేసుకుని ఇంటికి వచ్చేస్తాడు. అయితే అతన్నే టాపర్‌గా డిక్లేర్‌ చేస్తుంది యుపీయస్‌సీ. అంతే కాకుండా అతనికి ప్రత్యేక అధికారాలిస్తూ ప్రయోగాత్మకంగా ఏలూరు కలెక్టర్‌గా నియమిస్తుంది. అక్కడ లోకల్‌లో విశాఖవాణి (రమ్యకృష్ణ)కు మంచి పలుకుబడి ఉంటుంది. ఆమె కొడుకు రాష్ట్రానికి సీఎం. అక్కడి తెల్లేటి సరస్సు మీద ఆమె ఎలా గ్రిప్‌ పెంచుకుంది? దాని వల్ల ఎవరెలా నష్టపోయారు? ఎన్నారై మైరాకు దానివల్ల కలిగిన ఇబ్బందులేంటి? ఆమె సోదరుడు వరుణ్‌ ఏమయ్యాడు? వంటివన్నీ ఇంట్రస్టింగ్‌ విషయాలు. జిల్లా కలెక్టర్‌గా సాయిధరమ్‌తేజ్‌ మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ చూపించారు. సీఎం తల్లి విశాఖవాణి పాత్రలో రమ్యకృష్ణ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశారు. మైరా లాంటి పాత్రలు ఐశ్వర్య రాజేష్‌కి కొట్టిన పిండి. మిడిల్‌ ఏజ్డ్ కలెక్టర్‌గా సుబ్బరాజు, హీరో తండ్రి దశరథ్‌గా జగపతిబాబు పర్ఫెక్ట్ గా ఫిట్‌ అయ్యారు. కరెప్టడ్‌ పోలీస్‌గా శ్రీకాంత్‌ అయ్యంగార్‌ నటన బావుంది. ఆటో డ్రైవర్‌ మణి కేరక్టర్‌ రాహుల్‌ రామకృష్ణకి బాగా సూట్‌ అయింది. తెల్లేరు గురించి హీరోకి మణి వివరించే సీన్‌ బావుంది.

సినిమాలో అడుగడుగునా వినిపించే డైలాగులు దేవ్‌ కట్టా ప్రస్థానాన్ని ఇంకో సారి గుర్తుచేస్తాయి. వ్యవస్థ మీద అవగాహనతో అర్థవంతంగా డైలాగులు రాసుకున్నారు దేవ్‌ కట్టా. వాటిని సాయిధరమ్‌తేజ్‌ చెప్పిన తీరు కూడా బావుంది. ఎక్కడా కన్‌ఫ్యూజన్‌కి తావు లేకుండా చేశారు. అధికారులు, న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ కలిసి పనిచేసినప్పుడే సొసైటీ బావుంటుందనే థీమ్‌ని డ్రైవ్‌ చేశారు. రాజకీయ వ్యవస్థ పెత్తనం వల్ల మిగిలిన రెండు వ్యవస్థలూ పక్కదారిపడుతున్నాయనే విషయం చుట్టూ కథ అల్లుకున్నారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఎన్‌కౌంటర్ల వల్ల కలిగే లాభం కన్నా, నష్టం జరిగే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. ఇలాంటి విషయాలు సందర్భానుసారంగా సినిమాలో చాలానే ఉన్నాయి.

తాను చెప్పాలనుకున్న కథను గట్టిగా చెప్పిన దేవ్‌, కథలో మిగిలిన విషయాల మీద కూడా కాస్త ఫోకస్‌ చేయాల్సింది. తన తండ్రికి ఏదో జరిగిందని హీరో మారిపోలేదు. కానీ తన తండ్రికి ఏదో జరిగిందని చెడు మార్గాన్ని ఎంచుకుంటుంది విశాఖవాణి. వారిద్దరి పోరాటం సొసైటీ మీదే. అయితే ఎంపిక చేసుకున్న మార్గాలే వేరు… అని చెబుతూ విశాఖవాణిలోని సాఫ్ట్ యాంగిల్‌ని కూడా పరిచయం చేసేసరికి, ఎక్కడో ఆడియన్‌ కథతో కనెక్ట్ కాలేకపోతాడు. మార్పు జనాల్లో రావాలన్న మాట నిజమే. కానీ దానికోసం కృషి చేసే వ్యక్తిని చూసి సాటి వారు ఇన్‌స్పయిర్‌ అవ్వాలి. అలా కాకుండా, పోరాడిన వాడి ప్రాణాలకు భరోసా ఉండదని ముగింపు పలికితే…? ఈ ముగింపుని ఆడియన్స్ ఎలా అర్థం చేసుకోవాలి? ఈ కథనం తెలుగు తెరకు కొత్తే. కానీ ఇలాంటి వాటికి ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి.

(Entertainment Desk, TV9 Telugu)

Also Read..

Bandla Ganesh: నామినేషన్‌ను ఉపసంహరించుకున్న బండ్ల గణేష్.. ఆయన జోక్యంతో..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను కలిసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు