Bandla Ganesh: నామినేషన్ ఉపసంహరణ.. పోటీ నుంచి తప్పుకున్న బండ్ల గణేష్

Movie Arists Association: మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్(MAA) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ దాఖలు

Bandla Ganesh: నామినేషన్ ఉపసంహరణ.. పోటీ నుంచి తప్పుకున్న బండ్ల గణేష్
Bandla Ganesh
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 01, 2021 | 5:19 PM

మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్(MAA) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అక్టోబర్ 10వ తేదీన మా ఎన్నికలు జరగనుండగా.. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఇదిలా ఉంటే.. స్వతంత్ర అభ్యర్ధిగా జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ దాఖలు చేసిన నిర్మాత బండ్ల గణేష్.. అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంతేకాకుండా తన మద్దతు ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు ఉంటుందని ట్వీట్ రూపంలో క్లారిటీ ఇచ్చేశారు. ‘నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను’ అని బండ్ల గణేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కాగా, మొదట ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో ఉన్న బండ్ల గణేష్.. అనుహ్యంగా ఆ ప్యానల్ నుంచి తప్పుకుని స్వతంత్రంగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. జనరల్ సెక్రటరీగా తనను ఎన్నుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా వినూత్న ప్రచారానికి తెర తీశారు బండ్ల గణేష్. అయితే ఇప్పుడు అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. అటు అధ్యక్ష పదవికి పోటీ ఉన్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్.. ఇప్పటికే తమ ప్యానల్ సభ్యులను ప్రకటించడమే కాకుండా నామినేషన్లు కూడా దాఖలు చేశారు. అటు నటుడు సీవీఎల్ కూడా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. వీరి మధ్య ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.