Viral Video: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు.. ఒక్క పాము కోసం మరో మూడు పాములు.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

ఆస్ట్రేలియా అనగానే మనకు ఏం గుర్తుకు వస్తాయి. కంగారులు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే కంగారులు కేవలం ఆస్ట్రేలియాలోనే ఉంటాయి. అందుకే ఆస్ట్రేలియాన్లను కంగారులు అని కూడా అంటాం...

Viral Video: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు.. ఒక్క పాము కోసం మరో మూడు పాములు.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Snake
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 01, 2021 | 3:59 PM

ఆస్ట్రేలియా అనగానే మనకు ఏం గుర్తుకు వస్తాయి. కంగారులు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే కంగారులు కేవలం ఆస్ట్రేలియాలోనే ఉంటాయి. అందుకే ఆస్ట్రేలియాన్లను కంగారులు అని కూడా అంటాం. ఆస్ట్రేలియాలో కంగారులే కాకుండా పాములు కూడా ఎక్కువగానే ఉంటాయి. అక్కడ అడవులు ఎక్కువగా ఉండటంతో రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పాములను చూడొచ్చు. కంగారులు చాలా సందర్భల్లో పాము కాటు గురయ్యారు కూడా. ఇక్కడ పాములు ఎక్కువ కాబట్టి పాములు పట్టే వారు కూడా ఎక్కువగానే ఉన్నారు.

ఆస్ట్రేలియాలో ఇళ్లలోకి పాములు చేరడం సాధారణం. అప్పుడు వారు పాములు పట్టేవారిని పిలిపించి పాములను బయటకు పంపుతారు. ఇలా ఓ మహిళ ఇంట్లోకి పాములు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పాములు వచ్చాయి. ఆమె వెంటనే తన స్నేహితురాలికి ఈ విషయం చెప్పింది. ఆమె పాములు పట్టేవారిని పిలిచారు. అతడు వచ్చి పామలు పట్టుకునే ప్రయత్నం చేయగా అవి ఒకదానికి ఒకటి పెనవేసుకొని ఉన్నాయి. అందులో మూడు మగ పాములు కాగా ఒకటి ఆడ పాము ఉంది. ఈ ఆడ పాము కోసం మూడు మగ పాములు పోరాడుతున్నట్లు స్నేక్ క్యాచర్ గమనించారు. వైల్డ్ ఎన్‌కౌంటర్స్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‎గా మారింది.

Read Also.. Viral News: వామ్మో… ఇదేందయ్యా ఇది… “ఆ బిస్కెట్లు తినకపోతే పిల్లలకు కీడు”.. షాపుల ముందు క్యూ