- Telugu News Photo Gallery Business photos Whats app News Feature: whatsapp launches indian rupee symbol in chat composer to encourage digital payments
WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. డిజిటల్ చెల్లింపులు మరింత సులభతరం..!
WhatsApp: వాట్సాప్ సంస్థ రోజుకో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా..
Subhash Goud | Edited By: Phani CH
Updated on: Oct 01, 2021 | 9:17 AM

WhatsApp: వాట్సాప్ సంస్థ రోజుకో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా పేమెంట్స్ జరుపుకొనే అవకాశం కల్పించిన వాట్సాప్.. వినియోగదారులకు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఛాట్ కంపోజర్‌లో రూపీ గుర్తును అందుబాటులోకి తీసుకువచ్చింది.

కంపోజర్‌లో కెమెరా ఐకాన్ ద్వారా ఇకపై ఏదైనా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకోవచ్చని.. దీని ద్వారా దేశంలోని 2 కోట్ల స్టోర్లలో ఎక్కడైనా చెల్లింపులు చేయొచ్చని వెల్లడించింది. దీని ద్వారా వాట్సాప్ ద్వారా డిజిటల్ నగదు చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. వాట్సాప్ తీసుకొచ్చిన రూపీ సింబల్.. మరికొద్ది రోజుల్లోనే యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుందని సంస్థ తెలిపింది.

వాట్సాప్ ద్వారా డిజిటల్ నగదు చెల్లింపులు మరింత సులభతరం చేయాలన్నదే తమ లక్ష్యమని ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో వాట్సాప్ పేమెంట్స్ విభాగం డైరెక్టర్ మనేష్ మహాత్మ తెలిపారు.

వాట్సాప్‌ను ప్రతి రోజూ మిలియన్ల సంఖ్యలో వినియోగదారులు వాడుతుంటారని.. ఎన్నో నిమిషాలు యాప్‌పై ఉంటారని అన్నారు. డిజిటల్ నగదు లావాదేవీలను వాట్సాప్‌లో ఓ మెసేజ్ పంపినంత సులభతరమైన ప్రక్రియగా మార్చాలన్నది తమ అభిమతమని మనేష్ మహాత్మ వ్యాఖ్యానించారు. డిజిటల్ పేమెంట్స్ విప్లవంలో భారత్ ఎంతో ముందుందని తెలిపారు.

అయితే ఈ విషయంలో దేశం ఆరంభంలోనే ఉందని పేర్కొన్నారు. దేశంలోని సుమారు 80 శాతం మంది వినియోగదారుల లావాదేవీలు ఇంకా నగదు రూపంలోనే జరుగుతున్నాయని, భారత్‌లో మూడింట రెండింతల ప్రాంతం ఇంకా గ్రామీణంలోనే ఉందని.. రాబోయే రోజుల్లో డిజిటిల్ ఇన్నోవేషన్ ప్రయోజనాలు చూస్తామని అన్నారు.





























