- Telugu News Photo Gallery Business photos UIDAI: Aadhaar Card Authentication Charges Reduced.. Check details
Aadhaar: ప్రజలకు శుభవార్త.. భారీగా ఆధార్ అథెంటికేషన్ ఛార్జీల తగ్గింపు.. ఎంత అంటే..!
Aadhaar: ఇప్పుడున్న రోజుల్లో ప్రతిపనికి ఆధార్ ముఖ్యమైనదిగా అయిపోయింది. ప్రభుత్వ పథకాల నుంచి టెలికాం ఆపరేటర్ల వెరిఫికేషన్, ఇతర పనులకు ఆధార్ తప్పనిసరి...
Updated on: Oct 02, 2021 | 6:21 AM

Aadhaar: ఇప్పుడున్న రోజుల్లో ప్రతిపనికి ఆధార్ ముఖ్యమైనదిగా అయిపోయింది. ప్రభుత్వ పథకాల నుంచి టెలికాం ఆపరేటర్ల వెరిఫికేషన్, ఇతర పనులకు ఆధార్ తప్పనిసరి. అన్ని పనులకు ఆధార్ అథెంటికేషన్ అడుగుతున్నారు. అయితే తమ వివరాలను ఆధార్ ద్వారా ధృవీకరించడానికి కార్డుదారులు కొంత మేర డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.


ఈ సందర్భంగా యూఐడీఏఐ సీఈఓ సౌరభ్ గార్గ్ మాట్లాడుతూ.. ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో ఆధార్‌ని ప్రభావితం చేసే చేసే సామర్థ్యం అపారమైనదని, అథెంటికేషన్ ఛార్జీలను రూ.20 నుంచి రూ.3 కి తగ్గించామని అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ మౌలిక సదుపాయాల శక్తిని వివిధ ఏజెన్సీలు, సంస్థలు ఉపయోగించుకునేలా చూడటమే మా లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు ఆధార్ వ్యవస్థను ఉపయోగించి 99 కోట్లకు పైగా ఇ-కెవైసీలు జరిగాయని, కొత్త యూజర్లకు, ఫిన్‌టెక్ కంపెనీలకు తగ్గించిన ధరలు ఉపయోగపడతాయని సౌరభ్ తెలిపారు.

కొన్ని రోజుల కిందట కూడా యూఐడీఏఐ కొన్ని మార్పులను చేసింది. ఈ మార్పుల్లో భాగంగా మొబైల్ నంబర్ నమోదు చేసుకోని కార్డుదారులు తమ వెబ్‌సైట్ నుంచి ఆధార్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ లేని కార్డుదారులకు డాక్యుమెంట్ డౌన్‌లోడ్ చేయడంలో ఈ సదుపాయం సహాయపడుతుందని యూఐడీఏఐ తెలిపింది.

ఇకపోతే గత వారం టెలికమ్యూనికేషన్ల విభాగం కూడా మార్పులు జరిగాయి. కాంటాక్ట్‌లెస్, కస్టమర్-సెంట్రిక్, సెక్యూర్డ్ కెవైసీ ప్రక్రియలను అమలు చేయడానికి వరుస ఆదేశాలను జారీ చేసింది. కేవైసీ ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి, చందాదారుల సముపార్జనను పూర్తిగా ఆన్‌లైన్‌లో చేయడానికి సంస్కరణలు తీసుకువచ్చినట్లు డీఓటీ తెలిపింది.





























