Elaichi Water Benefits: యాలకుల నీటితో బోలెడు ఉపయోగాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

యాలకుల నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి కూడా సహాయపడుతుంది.

Elaichi Water Benefits: యాలకుల నీటితో బోలెడు ఉపయోగాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
Elaichi Water Benefits
Follow us
Venkata Chari

|

Updated on: Oct 01, 2021 | 5:20 PM

Elaichi Water Benefits: యాలకులు మన వంటశాలలలో సాధారణంగా ఉపయోగించే మసాలాలో ముఖ్యమైనది. ఇది ఆహార రుచిని పెంచడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అయితే, ఇది రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఏలకులలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో అనేక పోషకాలు కూడా ఉన్నాయి. యాలకులు విటమిన్లు-రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి, ఖనిజాలు-ఇనుము, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పినిన్, సబినిన్, మైసిన్, ఫెలాండ్రిన్, డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎన్నో ఇందులో ఉన్నాయి.

యాలకులు యాంటీఆక్సిడెంట్, యాంటీ-ఎమెటిక్, యాంటీటస్సివ్, మ్యూకోలైటిక్ లక్షణాలను కలిగి ఉన్నాయి. అలాగే ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంది. యాలకులు ఆరోగ్యం జీర్ణం కావడం నుంచి రక్తంలో చక్కెర స్థాయి వరకు అన్నింటినీ నియంత్రించడంలో సహాయపడుతుంది. యాలకులను అనేక వంటలలో ఉపయోగిస్తాం. అయితే, యాలకుల నీటిని తాగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా. అయితే ఇది చదవండి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. యాలకుల నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అసలు ఆ నీటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

యాలకుల నీరు తయారు చేసే విధానం.. యాలకుల నీరు చేయడానికి ముందుగా ఒక లీటరు నీటిని తీసుకోవాలి. అందులో 5 నుంచి 6 యాలకులను దంచి వేయాలి. ఈ నీటిని రాత్రంతా ఉంచాలి. ఉదయం లేచిన తరువాత ఈ నీటిని మరిగించాలి. ఈ నీరు బాగా ఇంకి పోయి దాదాపు 3/4 ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేయాలి. అనంతరం ఈ నీటిని ఫిల్టర్ చేసి రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు తాగాలి.

యాలకుల నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు.. యాలకుల నీరు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యాలకుల నీటిని తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.

జీర్ణక్రియను సక్రమంగా ఉండేలా.. మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు ఏలకుల నీరు తీసుకోవాలి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయి.

బరువును అదుపులో ఉంచేందుకు.. మీరు బరువు తగ్గాలనుకుంటే ఖచ్చితంగా యాలకుల నీరు తీసుకోవాల్సిందే. మీ లక్ష్యాన్ని సాధించడంలో యాలకుల నీరు ఎంతగానో సహాయపడుతుంది. ఈ నీటిలో పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తొలగించడం ద్వారా బరువును నియంత్రించడంలో సహాయపడతాయి.

కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు యాలకుల నీరు తీసుకోవాలి. ఈ నీరు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. తద్వారా గుండె జబ్బులను దూరంగా ఉంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇది శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

Also Read: ఆ యాప్ టీనేజ్‌ అమ్మాయిలకు సమస్యగా మారిందా..! అందుకే నిలిపివేశారా..?

International Coffee Day 2021: అన్ని టెన్షన్లకు ఒక్కటే పరిష్కారం.. కప్పు కాఫీ