AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acai Berries Benefits: అకాయ్ బెర్రీస్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. అకాల వృద్ధాప్యానికి చెక్

Acai Berries Health Benefits: ప్రకృతిలో లభించే మొక్కలు, పండ్లు, కూరగాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి.  బెర్రీస్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెర్రీస్ లో..

Acai Berries Benefits: అకాయ్ బెర్రీస్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. అకాల వృద్ధాప్యానికి చెక్
Acai Berries
Surya Kala
|

Updated on: Oct 01, 2021 | 1:04 PM

Share

Acai Berries Health Benefits: ప్రకృతిలో లభించే మొక్కలు, పండ్లు, కూరగాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి.  బెర్రీస్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెర్రీస్ లో ఒక రకం అకాయ్ బెర్రీలు. వీటిల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులకు వైజ్ఞానికంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయని నిరూపించబడింది.  అకాయ్ బెర్రీలలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులతో సహా అనేక రకాల వ్యాధులకు  పరిస్థితులకు కారణమయ్యే అనేక ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. అకాయ్ బెర్రీలలో అధిక స్థాయిలో ఆంథోసైనిన్లు  ఉన్నాయి. ఇవి శారీరకంగా అనేక వ్యాధులను నివారిస్తాయి.

రక్తపోటును నియంత్రిస్తుంది:

అకాయ్ బెర్రీలలో ప్లాంట్ స్టెరాల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి వాసోడైలేటర్లుగా పనిచేస్తాయి. రక్తపోటును నివారిస్తాయి. గుండెపోటుకు దారితీసే రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. రక్తం యొక్క ప్రసరణ, రక్తంలోని ఆక్సిజనేషన్‌ను మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గడానికి:

అకాయ్ బెర్రీలు బరువుని నియత్రించే మంచి ఆహారం. గత కొంతకాలంగా అకాయ్ బెర్రీలను బరువు తగ్గడానికి వాడే మందులు , మాత్రలు బాగా ప్రాచుర్యం పొందాయి

కొలస్ట్రాల్ అదుపు: 

ఒక అధ్యయనం ప్రకారం 30 రోజులు అకాయ్ బెర్రీలు తిన్నవారిలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉన్నాయి. ముఖ్యంగా  ఇన్సులిన్ ఉత్పత్తిలో నియంత్రణతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాయి. వీటిల్లో ఉండే ఫైబర్ కంటెంట్ ఆకలిని తగ్గిస్తుంది. దీంతో అతిగా తినే అలవాటు ఉన్నతికి మంచి సహాయకారి.

చర్మ సంరక్షణ: 

అకాయ్ బెర్రీలో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ కారణంగా సౌందర్య ఉత్పత్తులలో తరచుగా  ఉపయోగిస్తున్నారు. ఇవి తింటే చర్మానికి ఆరోగ్యకరమైన, ఆకర్షణీయమైన గ్లో ఇస్తాయి. వాస్తవానికి, బ్రెజిల్‌లో.. చర్మ సంరక్షణ కోసం,  వ్యాధులకు చికిత్స చేయడానికి అకాయ్ బెర్రీ యొక్క గుజ్జు తరతరాలుగా ఉపయోగించబడుతోంది.

జీర్ణక్రియకు మంచి సహాయకారి: 

అకాయ్ బెర్రీలో ఫైబర్  అధికంగా ఉంటుంది. దీంతో ఇవి జీర్ణక్రియకు ఆహారం నుండి పోషకాలను గ్రహించడానికి సహాయపడతాయి. ఇది ప్రేగు కదలికలను పెంచుతుంది, విసర్జన ప్రక్రియలను క్రమం తప్పకుండా చేస్తుంది.  అతిసారం వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

అకాయ్ బెర్రీ జ్యూస్ విటమిన్ సి అధికం. దీంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.

శక్తిని ప్రేరేపిస్తుంది:

అకాయ్ బెర్రీలు శక్తిని పెంచుతాయి. దీంతో అలసట ను తగ్గిస్తాయి.  ముఖ్యంగా అథ్లెట్ల యొక్క క్రీడా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది.

అకాల వృద్ధాప్యన్ని నివారిస్తుంది: 

అకాయ్ బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల వృద్ధాప్య ప్రక్రియలు మందగిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు చర్మం, జుట్టు, దంతాలు,  కంటి ఆరోగ్యాన్ని విచ్ఛిన్నం చేసే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి. ఈ ఫ్రీరాడికల్స్ తరచుగా అకాల వృద్ధాప్యంతో సంబంధం కలిగి ఉంటాయి. అకాయ్ బెర్రీ సారం  చర్మం ముడతలు ఏర్పడకుండా చేస్తుంది.

మానసిక ఆరోగ్యానికి మంచిది: అకాయ్ బెర్రీలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. నాడీ రుగ్మతల అభివృద్ధి నుండి మెదడును రక్షిస్తాయి.

గాయాలను త్వరగా తగ్గిస్తాయి:

అకాయ్ బెర్రీలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయి. అంతేకాదు ఎకై బెర్రీ ఎక్స్‌ట్రాక్ట్స్ గాయం నయం వేగవంతం చేయడంలో మంచి ప్రభావాలను కలిగి ఉంటాయి.

జీవక్రియను మెరుగుపరుస్తాయి: 

అకాయ్ బెర్రీల జీవక్రియ, పనితీరు కూడా ప్రయోజనం చేకూరుస్తాయి.  అకాయ్ బెర్రీ సారం పెద్దలకు బహుముఖ ప్రయోజనాన్ని ఇస్తాయి.

Also Read: Allu Ramalingaiah Birth Anniversary: తెలుగు సినీ తోటలో నవ్వుల రేడు అల్లు రామలింగయ్య శత జయంతి నేడు..