AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Piles Ayurveda Tips: ఫైల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. నివారణకు ఆయుర్వేదంలో సింపుల్ చిట్కాలు..

Piles Ayurveda Tips: మలవిసర్జన కష్టతరమైనా, మామూలుగా కాక తక్కువసార్లు మలవిసర్జన జరుగుతున్నా దానిని ‘మలబద్దకం’గా పరిగణించాలి. ఈ విధంగా ఉన్నప్పుడు, మలవిసర్జన..

Piles Ayurveda Tips: ఫైల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. నివారణకు ఆయుర్వేదంలో సింపుల్ చిట్కాలు..
Piles Ayurveda Tips
Surya Kala
|

Updated on: Mar 15, 2023 | 2:00 PM

Share

Piles Ayurveda Tips: మలవిసర్జన కష్టతరమైనా, మామూలుగా కాక తక్కువసార్లు మలవిసర్జన జరుగుతున్నా దానిని ‘మలబద్దకం’గా పరిగణించాలి. ఈ విధంగా ఉన్నప్పుడు, మలవిసర్జన ప్రక్రియ కష్టతరంగా ఉంటుంది. మలద్వారానికి పైన పురీషనాళం చివరన వాచిపోయిన రక్తనాళాలను.. ‘మొలలు’ అంటారు. మొలలు ఏర్పడటానికి ప్రధాన కారణం మలబద్ధకం. మల విసర్జన సాఫీగా లేకపోవడం వల్ల ఈ సమస్యకు దారితీస్తుంది. కొందరిలో మలద్వారం దగ్గర ఉండే సిరలు బలహీనంగా ఉండటం వల్ల కూడా మొలలు సమస్య ఉత్పన్నమవుతుంది. అధికబరువు వారిలో కూడా ఈ ఇబ్బంది ఎదుర్కొంటారు. అంతేకాదు ఆహారపు అలవాట్లు, పీచు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారంను తిన్నవారికి కూడా ఫైల్స్ ఏర్పడతాయి. ఈ పైల్స్ ఉన్నవారిలో మల విసర్జన  సమస్య ఏర్పడుతుంది. రక్తం పడుతూ ఉంటుంది. దురద ఉంటుంది. ముఖ్యంగా గర్భం ధరించిన స్త్రీలలో ఎక్కువగా ఫైల్స్ సమస్య అధికంగా ఉంటుంది. వీటి నివారణకు ఆయుర్వేదంలోని సింపుల్ చిట్కాలతో శాశ్వతంగా పెట్టవచ్చు.. అవి ఏమిటో తెలుసుకుందాం..

*పసుపు:  పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. హేమోరాయిడ్లను సృష్టించే మంటను తగ్గిస్తుంది. హేమోరాయిడ్ల ఫలితంగా ఏర్పడిన ఏదైనా పగుళ్లను నయం చేయడంలో పసుపు సహాయపడుతుంది.

*అల్లం   అల్లం ప్రభావవంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది మరియు పైల్స్ వల్ల కలిగే మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం యొక్క యాంటీఆక్సిడెంట్ ప్రభావం ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేయడానికి , కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. హేమోరాయిడ్ల వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

* పిప్పలి  పైల్స్  రావడానికి ముఖ్య కారణం అజీర్ణం, పిప్పలి తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం పిప్పాలి తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనికి కారణంగా ఆకలి పెరుగుతుంది.

 *నల్ల మిరియాలు   నల్ల మిరియాలు జీర్ణ రసాలను మరియు ఎంజైమ్‌లను ప్రేరేపిస్తాయి, తద్వారా జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, ఇది మీ శరీరలోని ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. నల్ల మిరియాలు ప్యాంక్రియాటిక్ ఎంజైమ్‌లపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతాయని, మొత్తం జీర్ణ ప్రక్రియకు ప్రయోజనం చేకూరుస్తుందని పరిశోధనలో తేలింది.  నల్ల మిరియాలు కూడా కార్మినేటివ్ లక్షణాలను కలిగి ఉంటాయి మరియు కడుపు వాయువు నుండి ఉపశమనం పొందుతాయి. ఇది అపానవాయువు కడుపు నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

ఆముదం నూనె

ఆముదంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫంగస్, బ్యాక్టీరియా నివారించే లక్షణాలు ఉన్నాయి. అందుకనే ఇది మొలల పరిమాణాన్ని, నొప్పిని తగ్గించటంలో సాయపడుతుంది. ఆముదాన్ని రాత్రి పూట తీసుకున్నా లేక మొలల ప్రాంతాల్లో రాసినా ప్రభావంతంగా పనిచేస్తుంది.

ఇంగువ :  మొలల సమస్య ఉన్నవారికి ఇంగువ దివ్య ఔషధం. దీనిని రోజూ తినే ఆహారంలో భగంగా చేసుకోవడం వలన జీర్ణ క్రియను తగ్గిస్తుంది. మొలల సమస్యను నివారిస్తుంది.  .

త్రిఫల చూర్ణం పొడి: మొలల సమస్యకి ప్రధాన కారణం మలబద్ధకం. కాబట్టి త్రిఫల చూర్ణం పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. ఇక మళ్లీ పైల్స్ ఇక పెరగవు.  మొలలపై త్రిఫల చూర్ణం అత్యంత ప్రభావం చూపిస్తుంది.

Also Read: Rana Daggubati: 50 లక్షల మొక్కలను నాటడమే టార్గెట్‌గా ఏరియల్ సీడింగ్ కార్యక్రమం.. పాల్గొన్న హీరో రానా..