Rana Daggubati: 50 లక్షల మొక్కలను నాటడమే టార్గెట్‌గా ఏరియల్ సీడింగ్ కార్యక్రమం.. పాల్గొన్న హీరో రానా
Rana Daggubati: రోజు రోజుకీ ఆధునిక పేరుతో పెరుగుతున్న మనిషి చేస్తున్న పనులకు గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. దీని ప్రభావంతో సముద్ర మట్టాలు పెరగడం, వేడి తరంగాలతో..
Rana Daggubati: రోజు రోజుకీ ఆధునిక పేరుతో పెరుగుతున్న మనిషి చేస్తున్న పనులకు గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. దీని ప్రభావంతో సముద్ర మట్టాలు పెరగడం, వేడి తరంగాలతో శీతోష్ణస్థితిలో హెచ్చుతగ్గులు, ఎడారుల విస్తరణ జరుగుతాయి. ముఖ్యంగా ఉద్గారాల వలన వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో అటవీ సంపద తరుగుతుంది. వాయుకాలుష్యం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వృక్ష సంపదను పెంచే కార్యక్రమాన్ని ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్చందం సంస్థలు చేపట్టాయి. తాజాగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనకేషన్స్, అటవీశాఖ ఆధ్వర్యం లో దేశం లోనే మొదటి సారిగా హర బహారా పేరుతో ఏరియల్ సీడింగ్ కార్యక్రమం మొదలు పెట్టింది. ఈ కార్యక్రమంలో హీరో దగ్గుపాటి రానా, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
భారతదేశంలో 2030 నాటికి డ్రోన్స్ ద్వారా 1 బిలియన్ చెట్లను నాటడం లక్ష్యం గా హర బరా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా అటవీ సంరక్షణను వేగవంతం చేయనున్నారు. ఏరియల్ సీడింగ్ , టెక్నాలజీ ద్వారా వేగంగా అటవీ సంపదను పెంచడం ఈ హర బర ప్రధాన లక్ష్యం. ఈ సీడ్‌కాప్టెటర్ ద్వారా వచ్చే వర్షాకాలానికి తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లోని అడవులలో 12,000 హెక్టార్ల భూమిలో 50 లక్షల చెట్లను నాటడం టార్గెట్ గా నిర్దేశించుకున్న.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న హీరో దగ్గుబాటి రానా టీవీ9 తో మాట్లాడుతూ.. పర్యావరణ సంరక్షణపై పలు విషయాలను పంచుకున్నారు. టెక్నాలజీ ఉపయోగించి చెట్లను నాటడం అనే కొత్త ఆలోచన తనకు సంతోషము కలిగించిందని తెలిపారు. అంతేకాదు ఈ కార్యక్రమం అభినందించ దగ్గ విషయమని అన్నారు. తాను హాథీ మేరీ సాథీ సినిమా షూటింగ్ సమయంలో అడవిలో రెండు రెళ్ళు ఉన్నానని.. అప్పుడు తనకు అటవీ సంపద గొప్పదనం తెలిసిందని అన్నారు. ఇక మనిషి మెసేజ్ ఇచ్చే సమయం అయిపోయింది. పని చేసే సమయం వచ్చింది. మనిషి కనుక ఇప్పుడు మనం సరిగ్గా వనరులను కాపాడుకోకపోతే.. భవిష్యత్ తరాలకు ఇబ్బంది తప్పదని.. మనుగడ కష్టమవుంటుందని రానా చెప్పారు.
డ్రోన్స్ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న నటుడు రానా దగ్గుబాటి..
Gadgets are always fun utilising Drone for planting seeds @RanaDaggubati all smiles snapped at kbr park Hyderabad@ArtistryBuzz #ranadaggubati #southpaparazzi #tollywoodcelebs pic.twitter.com/dfKZkhYrWx
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 1, 2021