Chiranjeevi Rajamundry Tour: చిరంజీవి టూర్‌లో పాల్గొననున్న వైసీపీ మంత్రులు, నేతలు.. హాట్ హాట్‌గా ఏపీ పాలిటిక్స్
Chiranjeevi Rajamundry Tour: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎన్నికల వేడిని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై సర్వత్రా ఆసక్తినెలకొంది..
Chiranjeevi Rajamundry Tour: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎన్నికల వేడిని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై సర్వత్రా ఆసక్తినెలకొంది. రాజమండ్రి లోని అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల, ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఈరోజు చిరంజీవి ఆవిష్కరించనున్నారు. ఉదయం 10.35 గంటలకు చిరంజీవి మధురవాడ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చిరంజీవి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట మధ్య విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఇదే విషయాన్ని అల్లు రామలింగయ్య హోమియో కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పారు. చిరంజీవి పర్యటనలో మంత్రులు వైసీపీ నేతలు పాల్గొన్నారు.
అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణలో మంత్రులు కన్నబాబు, పినిపే విశ్వరూపం, చెల్లుబోయిన వేణుగోపాల్ రావు, ఎంపీలు పిల్లు సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్ తో పాటు పలువులు ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు హాజరవుతున్నారు. ఓ వైపు వైసీపీ ప్రభుత్వానికి జనసేనకు మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. మరోవైపు చిరంజీవి పర్యటనలో వైసీపీ మంత్రులు, నేతలు పాల్గొనడంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఇక చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో హోమియోపతి కళాశాల కొత్త భవనానికి రూ.2 కోట్ల రూపాయలను కేటాయించిన సంగతి తెలిసిందే.