Horoscope October 2021: ఈ నెలలో ఈ రాశివారు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.. ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope October 2021: అక్టోబర్ నెల మొదలైంది. దీంతో ఈ నెల రాశి ఫలాలను తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. తమ నక్షత్రం  రాశి చక్రం ఆధారంగా చేయాల్సిన..

Horoscope October 2021: ఈ నెలలో ఈ రాశివారు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.. ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Monthly Horoscope
Follow us
Surya Kala

|

Updated on: Oct 01, 2021 | 10:36 AM

Horoscope October 2021: అక్టోబర్ నెల మొదలైంది. దీంతో ఈ నెల రాశి ఫలాలను తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. తమ నక్షత్రం  రాశి చక్రం ఆధారంగా చేయాల్సిన పనులు,  మంచి చెడులను గురించి తెలుసుకుని.. అందుకు తగిన విధంగా కార్యక్రమాలను చేపట్టేవారు చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మేషం,  వృషభం , మకరం, వృశ్చికం, మీనం వరకు, అక్టోబర్ నెలలో మీ భవిష్యత్ ఎలా ఉండనుందో ముందుగానే తెలుసుకోండి..

మేష రాశి

మేష రాశి వాసులు ఎల్లప్పుడూ విహారయాత్రను ఇష్టపడతారని, ఈ నెల వృత్తి, ఉద్యోగ రంగంలో ఉన్న వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. శుభఫలితాలు ఉంటాయి. విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు.  లాయర్ వృత్తి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.  11 వ స్థానంలో బృహస్పతి  ఉండడంతో ఈ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ నెల చివరిలో శుభ ఫలితాలను ఇస్తుంది. వైవాహిక సంబంధం సుఖ సంతోషాలతో ఉంటుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలి. ఈ రాశివారు కడుపు నొప్పితో బాధపడే అవకాశం ఉంది. ఈ నెలలో అనుకున్న పనులు జరిగే విధంగా షెడ్యూల్ చేసుకోండి.

వృషభం రాశి : 

వృషభరాశి వారికి .. ఈ నెల శుభఫలితాలను ఇస్తుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనులు జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు లక్ష్యం నిర్దేశించుకోవాలి. ఈ నెలలో  కార్పొరేట్ ఉద్యోగాలకు అనుకూలంగా ఉంటుంది.  పోటీని అధిగమిస్తారు. అయితే పన్నుల సమస్య కారణంగా, మార్కెటింగ్ , టెలికాం ఎంటర్‌ప్రైజ్ పరిశ్రమవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెలలో.. బంగారం. వెండి లోహాల ధరలు తగ్గుతాయి.  బంగారం వ్యాపారస్తులకు లాభం పొందడం కష్టమవుతుంది.  ఈ రాశివారు కుటుంబ సంబంధించి పనులు అనుకూలంగా జరుగుతాయి. నెల చివరి వారం మినహా అన్ని వారాలు ఆనందానికి అనుకూలంగా ఉంటాయి.. , కాబట్టి ప్రశాంతంగా ఉండండి. ఈ నెలలో, మీ ఫిట్‌నెస్ విషయంలో మీరు మరింత శ్రద్ధ వహిస్తారు.

మిథునం రాశి: 

ఈ రాశివారు ఆర్థిక , వ్యాపార జీవితం పరంగా మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. మొదటి రెండువారాలు కొంచెం నష్టాలు ఎదుర్కొంటారు. అయితే ఈ నష్టాలను చివరి రెండు రెండు వారాల్లో భర్తీ చేస్తారు. నిరాడంబరమైన వృత్తిని కలిగి ఉంటారు. మీకు తగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. దీంతో మంచి శుభఫలితాలను పొందుతారు.  దంపతుల మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే పెళ్లికానివారి పరిస్థితుల్లో మలుపులు చోటు చేసుకుంటాయి. నూతన దంపతులు సంతోషముగా ఉంటారు.  ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తలనొప్పితో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

కర్కాటక రాశి

ఈ నెలలో నిరుద్యోగులకు అనుకూలంగా ఉండేయి. ఉద్యోగం పొందే అవకాశాలు ఉంది. ఆందోళనను తగ్గించుకుని ప్రశాంతంగా జీవితం గడుపుతారు. కన్సల్టెంట్‌గా పనిచేసేవారికి మంచి ఆదాయం లభిస్తుంది. ఈ నెలలో  కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.  వాణిజ్య  విభాగంలో ఉన్నవారు ప్రత్యర్థుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  సహోద్యోగులతో   బంధాలను మరింతగా మెరుగుపరుచుకుంటారు. అయితే ఈ రాశి వారు మూడవ వారంలో శని ప్రభావంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు.  ఈ నెలలో, మీ వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య సంరక్షణ పరంగా ఈ నెలలో ఆందోళనను అధిగమిస్తారు.

సింహం రాశి: 

ఈ రాశివారు ఈనెలనే సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ఆశావాదులు విజయం సాధిస్తారు. విద్యార్థులు ఆందోళన చెందుతారు. పెద్దలు ఈ నెలలో తెలివైన వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకుంటారు.  కొత్తగా వ్యాపారంచేసే వ్యక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. బృహస్పతి అనుకూల దృష్టితో ఆర్థికంగా లాభం పొందుతారు. శృంగార పరంగా సంతోషముగా ఉంటారు. ఈ నెలలో సింహ రాశిలో ప్రేమికులు సంతోషముగా ఉంటారు. ఈ నెలలో పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నెల జీర్ణశయసమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ నెలలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఓర్పుతో మెలగాల్సి ఉంటుంది.

కన్య రాశి: 

కన్య రాశి వారు విదేశీయానం చేసే అవకాశం ఉంది. ఈ నెల ఈ రాశివారికి మంచి విజయాన్ని అందిస్తుంది. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటుంది. మొదటి రెండు వారాలు ప్రత్యేకించి జర్నలిజం వృత్తిలో ఉన్నవారికి మంచి ప్రయోజనాలు ఉంటాయి. అదృష్టాన్ని పొందుతారు. రెండు వారాల తర్వాత కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  ఈ నెలలో వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఇప్పటికే వివాహం చేసుకున్న వారికి..  జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.  ఈ నెల మూడో వారంలో  వివాహానికి సంబంధించి ప్రధాన ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ నెలలో అనుకూల ఫలితాలు వస్తాయి. అయితే మీరు రెండవ వారంలో దీర్ఘకాలిక సమస్యల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

తులారాశి: 

ఈ రాశివారికి ఈ నెలలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ నెల మూడో వారంలో విజయాలను సొంతం చేసుకుంటారు. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగావకాశాలను పొందుతారు. వ్యాపారస్తులకు తమ వ్యాపారాలను లాభదాయకంగానా నడపడానికి కష్టతరమవుతుంది.  రెండోవారం నుంచి లాభాలను ఆర్జిస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారికి అనుకూల ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉంటారు. అయితే కొంతమంది వయసురీత్యా బిపీ సమస్యను ఎదుర్కొంటారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వృశ్చికరాశి: 

ఈ రాశివారు ఈ నెలలో అటవీ ప్రాంతాన్ని పర్యటిస్తారు.  కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. నిర్మాణ రంగంలో పనిచేసే వారు ఈ నెలలో భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్ధికంగా ఇబ్బందులు పడతారు. ఈ నెలలో కొత్తవస్తువులు కొనుగోళ్ళకు దూరంగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.  బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది. అయితే వచ్చే నెల ముందు అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ నెలలో మీ ఆరోగ్య పరంగా సంతోషంగా ఉంటారు. సీజనల్ వ్యాధుల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

ధనుస్సు రాశి: 

ధనుస్సు రాశి  ఈ నెల శుభఫలితాలను ఇస్తుంది.  ముఖ్యంగా విద్యార్థులు, పండితులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఈ నెలలో,    కొత్త స్థాయికి చేరుకుంటారు. ఈ నెలలో  వృత్తి నైపుణ్యం వారికీ మంచి గుర్తింపు లభిస్తుంది. నెలలో మొదటి భాగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక ఈ నెలలో వస్తావ దృక్పధంతో మెలగాల్సి ఉంది. ఈ నెలలో.. వ్యక్తిగత విషయాలతో పాటు.. భాగస్వామి శ్రేయస్సుపై  ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నెల చివరి భాగంలో.. జీవిత భాగస్వామి వ్యక్తిత్వానికి సంబంధించి శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం పరంగా, నెల మొదటి భాగం హృదయ సంబంధ సమస్యల విషయంలో అదనపు జాగ్రత్త అవసరం.

మకరం రాశి: 

ఈ నెలలో ఈ రాశివారికి వృత్తి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా నేర్చుకునేవారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.  ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నెల మొదటి భాగంలో కొత్తగా చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయి. ఆర్థిక పరంగా, సురక్షితమైన స్థితిలో ఉంటారు. ఈ రాశిలో ప్రేమికులు సంతోషముగా గడుపుతారు.  వివాహం కానివారికి శుక్రుడు ప్రభావంతో శుభవార్త వింటారు.  వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ  నెల చాలా లాభదాయకంగా ఉంటుంది.  ఆరోగ్యం పరంగా కూడా సంతోషముగా ఉంటారు. అయితే చిన్న చిన్న విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ  వైఫల్యానికి భయపడకుండా ముందుకు సాగాల్సి ఉంది.

కుంభం రాశి: 

రాశివారికి ఈ నెల పూర్తిగా అస్థిరతతో ఉంటుంది. అయితే వాటన్నింటినీ అప్రమత్తంతో అధిగమిస్తారు. నెల మొదటి భాగంలో మిశ్రమ ఫలితాలు ఉండగా.. రెండో సగభాగంలో అవాంఛనీయమైన సంఘటనలు ఎదుర్కొంటారు. ఈ నెలలో ఆర్ధిక రంగంలోని వారు నిధులను సరిగ్గా నిర్వహించగలుగుతారు.   స్టాక్‌లను వ్యాపారంస్థులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. భారీ మొత్తంలో నష్టాలను ఎదుర్కోవాలి ఉంటుంది.  మీ ఆరోగ్యం విషయంలో పెద్ద సమస్యలు ఉండవు. అయితే తినే ఆహారం వలన ఇబ్బందులు ఏర్పడే అవకాశముంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మీన రాశి: 

ఈరాశి వారు ఈ  నెల సవాళ్లు, విజయాలతో నిండి ఉంటుంది.  వృత్తి సంబంధమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే వివిధ మార్గాల ద్వారా ఆదాయం పొందుతారు.   కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేవారు శుభఫలితాలను పొందుతారు. ఈ నెలాఖరులోపు, మీ సివిల్ కోర్టు సమస్యలు కూడా పరిష్కరించబడతాయి.  నిశ్చితార్థం జరిగిన వారు భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది.. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మీ ఆరోగ్య పరంగా స్వల్ప ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక పరిశుభ్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

Also Read: ఇంజనీరింగ్ పాసైనవారికి మంచి సాలరీతో ఉద్యోగావకాశాలు.. ఎలా అప్లై చేయాలంటే..