Allu Ramalingaiah Birth Anniversary: తెలుగు సినీ తోటలో నవ్వుల రేడు అల్లు రామలింగయ్య శత జయంతి నేడు..

Allu Ramalingaiah 100th Birth Anniversary: తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని నవ్వుల తోటలో పూసిన పువ్వు అల్లు రామలింగయ్య..  అల్లు రామలింగయ్య 100వ జయంతి నేడు..

Allu Ramalingaiah Birth Anniversary: తెలుగు సినీ తోటలో నవ్వుల రేడు అల్లు రామలింగయ్య శత జయంతి నేడు..
Allu Ramalingaiah
Follow us
Surya Kala

|

Updated on: Oct 01, 2021 | 12:15 PM

Allu Ramalingaiah 100th Birth Anniversary: తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని నవ్వుల తోటలో పూసిన పువ్వు అల్లు రామలింగయ్య..  అల్లు రామలింగయ్య 100వ జయంతి నేడు. సినిమాలో తాను నటించే పాత్రలతో పనిలేకుండా ఆ పాత్రలో లీలనమై నవ్వులు పూయించిన అల్లు రామలింగయ్య ఈరోజుకి సినీ ప్రేక్షకులకు ఫేవరేట్ నటుడు.  అల్లు పేరు వింటేనే నవ్వులు పూస్తూనే ఉంటాయి. వెయ్యి సినిమాలకు పైగా నటించిన అల్లు రామలింగయ్య టాలీవుడ్ లో మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించారు. అంతేకాదు అల్లు కుటుంబ సభ్యుల్లో చాలామంది సినీ పరిశ్రమకు చెందినవారే.  కుమారుడు అల్లు అరవింద్ సినీ నిర్మాత. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు.. ఇక మనవలు అల్లు అరవింద్, శిరీష్ లు కూడా నటులే.. తన నటనతో యాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానీకాన్ని అలరించిన అల్లును వరించిన సన్మానాలు, గౌరవాలు, అవార్డులకు అనేకం. భారత ప్రభుత్వం 1990లో ‘ పద్మశ్రీ’ అవార్డుతో గౌరవించింది. రేలంగి తరువాత ‘ పద్మశ్రీ’ అందుకున్న హాస్యనటుడు అల్లునే కావడం విశేషం. 2001 వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత ‘ రఘుపతి వెంకయ్య ‘ అవార్డును ఇచ్చి అల్లు రామలింగయ్యను గౌరవించింది.

అల్లు రామలింగయ్య 2004 జూలై 31 వ తేదీన తన 82 వ ఏట కన్నుమూసాడు. నటుడిగా, నిర్మాతగా అల్లు రామలింగయ్యది తెలుగు చిత్రసీమలో ప్రత్యేక స్థానం. ఆయన ఇప్పుడు భౌతికంగా లేకపోయినా.. సినిమాలతో తాను పండించిన హాస్యంతో నేటికీ సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. 2013లో భారత చలనచిత్ర పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలయిన 50 తపాలా బిళ్ళలలో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం విడుదలయింది.

అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బానర్‌ నెలకొల్పి అనేక సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఇక రేలంగి, రమణారెడ్డి, కుటుంబరావు, బాలకృష్ణ వంటివారి కాలంతో మొదలు పెట్టి.. ఈతరం హాస్యనటులు వరకూ కొనసాగిన ఏకైక హాస్యనటుడు అల్లునే. హోమియో వైద్యం నేర్చుకున్న అల్లు  ఉచిత వైద్యం చేస్తూనే నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.

Also Read: Piles Ayurveda Tips: ఫైల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. నివారణకు ఆయుర్వేదంలో సింపుల్ చిట్కాలు..

.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?