No Time To Die: 50 ఏళ్లు గడుస్తోన్నా చెక్కు చెదరని బాండ్‌ బ్రాండ్‌.. ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపుతోన్న ‘నో టైమ్‌ టు డై’..

No Time To Die: జేమ్స్‌ బాండ్‌.. ఈ పేరు వినని వారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అమెరికా నుంచి అనకాపల్లి వరకు అందరికీ జేమ్స్‌ బాండ్‌ క్యారెక్టర్‌ సుపరిచితమే. జేమ్స్‌ బాండ్‌...

No Time To Die: 50 ఏళ్లు గడుస్తోన్నా చెక్కు చెదరని బాండ్‌ బ్రాండ్‌.. ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపుతోన్న 'నో టైమ్‌ టు డై'..
Follow us

|

Updated on: Oct 01, 2021 | 12:20 PM

No Time To Die: జేమ్స్‌ బాండ్‌.. ఈ పేరు వినని వారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అమెరికా నుంచి అనకాపల్లి వరకు అందరికీ జేమ్స్‌ బాండ్‌ క్యారెక్టర్‌ సుపరిచితమే. జేమ్స్‌ బాండ్‌ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. జేమ్స్‌బాండ్‌ సిరీస్‌లో ఇప్పటి వరకు 24 చిత్రాలు వచ్చాయంటేనే ఈ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సిరీస్‌ నుంచి సినిమా వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ జనాలు ఆతృతతో ఎదురు చూస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సిరీస్‌ నుంచి 25వ చిత్రం ‘నో టైమ్‌ టు డై’ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దాదాపు అన్ని ఇండియన్‌ భాషల్లో చివరికి తెలుగులోనూ ఈ సినిమా విడుదలై కలెక్షన్ల వర్షం కురుపిస్తోంది.

దాదాపు రూ. రెండు వేలకు పైగా కోట్ల అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కురుపిస్తోంది. బాండ్‌ సిరీస్‌లో అత్యధికంగా ఖర్చు చేయడం ఇదే తొలిసారి. భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లో వసూళ్లు జరుగుతున్నాయి. కరోనా గడ్డు కాలంలోనూ ఈ సినిమా దూసుకుపోతోంది. విడుదలైన ఒక్క రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

ఆ సన్నివేశాలు కూడా..

హాలీవుడ్‌ చిత్రాలంటేనే సహాజంగానే కాస్త శృంగార భరిత సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇండియన్‌ చట్టాల ప్రకారం ఇలాంటి సన్నివేశాలను కత్తిరిస్తుంటారు. కానీ ఈసారి మాత్రం ఇండియాలో అన్‌కట్ ఎడిషన్ రిలీజైంది. ఎలాంటి కట్స్‌ లేకుండా బాండ్ రిలీజ్‌కు ఓకే చెప్పింది సెన్సార్‌ బోర్డు. కాకపోతే ఇండియన్‌ సినిమాలకు ఇచ్చే విధంగానే A సర్టిఫికేట్‌ ఇష్యూ చేసి ధియేటర్‌ రిలీజ్‌కు ఓకే చెప్పేసింది. దీంతో నో టైమ్ టూ డై సినిమా ఇంతకు ముందు బాండ్ సిమాల్లా కాకుండా లిప్‌లాక్‌లు.. శృంగార సన్నివేశాలతో ఇండియాలో రిలీజ్‌ అయిపోయింది.

మీకు తెలుసా.?

* ‘నో టైట్‌ టు డై’ బాండ్‌గా డేనియల్‌ క్రెగ్‌కి ఇది చివరి చిత్రం. ఇప్పటివరకు క్రెగ్‌ ఐదు సార్లు జేమ్స్‌ బాండ్‌గా నటించారు. * నో టైమ్‌ టు డై చిత్రాన్ని లండన్‌, జమైకా, ఇటలీలో చిత్రీకరరించారు. * ఈ సినిమా టైటిల్‌ను సాంగ్‌ను 18 ఏళ్ల యువ సంచలనం బిల్లీ ఐలిష్‌ ఈ పాట పాడటం విశేషం. చిన్న వయసులో బాండ్‌కి పాట పాడిన గాయకురాలిగా బిల్లీ రికార్డు సృష్టించింది.

Also Read: Allu Ramalingaiah: ముగ్గురు మనవళ్ల ముచ్చటైన సర్‌ప్రైజ్‌.. అల్లు స్టూడియోస్‌లో..

Republic Movie: ‘రిపబ్లిక్‌తో తేజ్‌ ఒకేసారి పది మెట్లు ఎక్కారు’.. అదరగొడుతోన్న ట్విట్టర్‌ రివ్యూలు. ఇంకా ఏమన్నారంటే..

Sunitha: అందాల కోయిల‌మ్మ‌ నీ అందమైన చిరునవ్వుకు కారణమేంటమ్మ.. వైరల్‌ అవుతోన్న సునీత లేటెస్ట్‌ ఫోటోలు.

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్