- Telugu News Photo Gallery Cinema photos Singer Sunitha Shares Her Latest Cute Photos In Instagram With With Interesting Caption
Sunitha: అందాల కోయిలమ్మ నీ అందమైన చిరునవ్వుకు కారణమేంటమ్మ.. వైరల్ అవుతోన్న సునీత లేటెస్ట్ ఫోటోలు.
Sunitha: తన గాత్రంతో ఎంతో మంది ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది అందాల సింగర్ సునీత. నిత్యం సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సునీత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసిన కొన్ని ఫోటోలు..
Updated on: Oct 01, 2021 | 8:14 AM

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు సింగర్ సునీత. తన అందమైన గాత్రంతోనే కాకుండా రూపంతోనూ నిండైన తెలుగుదనాన్ని తనలో నింపుకున్నారు సునీత.

కొన్నేళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత ఇటీవలే స్నేహితుడు రామ్‌తో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల సహకారంతో జరిగిన ఈ వివాహం తర్వాత సునీత అందమైన జీవితాన్ని గడుపుతున్నారు.

ఇక నిత్యం రియాలిటీ షోలు, సినిమాల్లో పాటలతో బిజీగా ఉండే సునీత.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత వివరాలను పంచుకుంటుంటారు.

ఈ క్రమంలోనే తన లేటెస్ట్ ఫోటో షూట్స్‌ను అభిమానులతో షేర్ చేసుకునే సునీత తాజాగా కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

వైట్ డ్రస్‌లో చిరునవులు చిందిస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సునీత.. 'సంతోషకరమైన సమయం' అంటూ క్యాప్షన్ జోడించారు. దీంతో ఈ నవ్వుకు కారణమేంటి అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.




