Mutual Funds: నెలనెలా కొంత పొదుపు చేయండి.. పదేళ్లలో లక్షల్లో ఆదాయం పొందండి..

వచ్చిన ఆదాయంలో కొంత పొదుపు చేయాలనుకుంటున్నారా..?  మీరు మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ప్రతీ నెలా కొంత పొదుపు చేయాలనుకుంటున్నారా?..

Mutual Funds: నెలనెలా కొంత పొదుపు చేయండి.. పదేళ్లలో లక్షల్లో ఆదాయం పొందండి..
Mutual Fund
Follow us

|

Updated on: Oct 01, 2021 | 7:41 PM

వచ్చిన ఆదాయంలో కొంత పొదుపు చేయాలనుకుంటున్నారా..?  మీరు మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ప్రతీ నెలా కొంత పొదుపు చేయాలనుకుంటున్నారా? ఏ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత లాభం వస్తుందా అని లెక్కలేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే..

మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువకాలం సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్ ఎంచుకునేదాని బట్టి రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. 10 ఏళ్ల క్రితం మ్యూచువల్ ఫండ్స్‌లో నెలనెలా కొంత చొప్పున సిప్ చేసినవారు ఇప్పుడు లక్షాధికారులయ్యారు. గత 18 నెలల్లో నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఏకంగా 221 శాతం రిటర్న్స్ ఇచ్చింది. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో సిప్స్ చేస్తున్నవారికి మంచి రిటర్న్స్ వచ్చినట్టు లెక్కలు చూస్తే తెలుస్తోంది. 2021 సెప్టెంబర్ 21 నాటికి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చాయో వివరిస్తూ ఓ ప్రైవేట్ సంస్థ ఓ కథనం ప్రచురించింది. వారు కథనంలో ప్రస్తావించిన మ్యూచువల్ ఫండ్స్‌లో గత పదేళ్లుగా ప్రతీ నెలా రూ.10,000 చొప్పున సిప్ చేసినవారికి ఇప్పుడు రిటర్న్స్ ఎంత వచ్చాయో లెక్కలు వివరించింది. గత 10 ఏళ్లలో మంచి రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ వివరాలు తెలుసుకోండి.

నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్‌లో 10 ఏళ్లుగా ప్రతీ నెల రూ.10,000 చొప్పున జమ చేసినవారికి ఇప్పుడు రూ.47,00,000 జమ అయ్యాయి. అంటే 10 ఏళ్లలో రూ.12,00,000 జమ చేస్తే రూ.35,00,000 రిటర్న్స్ వచ్చాయి. ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్‌లో 10 ఏళ్లుగా ప్రతీ నెల రూ.10,000 చొప్పున జమ చేసినవారికి కూడా రూ.47,00,000 జమ అయ్యాయి. ఈ ఫండ్‌లో కూడా 10 ఏళ్లలో రూ.12,00,000 జమ చేస్తే రూ.35,00,000 రిటర్న్స్ వచ్చాయి. కొటక్ స్మాల్‌ క్యాప్ ఫండ్‌లో 10 ఏళ్లుగా ప్రతీ నెల రూ.10,000 చొప్పున జమ చేసినవారికి రూ.41,00,000 జమ అయ్యాయి. ఈ ఫండ్‌లో 10 ఏళ్లలో రూ.12,00,000 జమ చేస్తే రూ.29,00,000 రిటర్న్స్ వచ్చాయి.

డీఎస్‌పీ స్మాల్ క్యాప్ ఫండ్‌లో 10 ఏళ్లుగా ప్రతీ నెల రూ.10,000 చొప్పున జమ చేసినవారికి రూ.39,00,000 జమ అయ్యాయి. ఈ ఫండ్‌లో 10 ఏళ్లలో రూ.12,00,000 జమ చేస్తే రూ.27,00,000 రిటర్న్స్ వచ్చాయి. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్‌లో 10 ఏళ్లుగా ప్రతీ నెల రూ.10,000 చొప్పున జమ చేసినవారికి రూ.35,00,000 జమ అయ్యాయి. ఈ ఫండ్‌లో 10 ఏళ్లలో రూ.12,00,000 జమ చేస్తే రూ.23,00,000 రిటర్న్స్ వచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్ క్యాప్ ఫండ్‌లో కూడా ఇలాగే భారీ రిటర్న్స్ వచ్చాయి. 10 ఏళ్లుగా ప్రతీ నెల రూ.10,000 చొప్పున జమ చేసినవారికి రూ.35,00,000 జమ అయ్యాయి. ఈ ఫండ్‌లో కూడా 10 ఏళ్లలో రూ.12,00,000 జమ చేస్తే రూ.23,00,000 రిటర్న్స్ వచ్చాయి.

పైన ఇచ్చిన ఉదాహరణలన్నీ పదేళ్ల క్రితం పొదుపు మొదలుపెడితే పదేళ్లకు వచ్చిన రిటర్న్స్ లెక్కలు ఇవి. సిస్టమెటిక్ ఇన్వెస్ట్ ప్లాన్ ద్వారా స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. మీరూ దీర్ఘకాలం పొదుపు చేయాలనుకుంటే మార్కెట్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి ఫండ్ ఎంచుకొని ప్రతీ నెలా జీతంలో కొంత పొదుపు చేస్తూ వెళ్లాలి. అయితే మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిపై వచ్చే రిటర్న్స్ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ ఎంచుకునేముందు స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులను బట్టి రిటర్న్స్ ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇది రిస్క్‎తో కూడుకున్నది.

స్మాల్ క్యాపు మ్యూచవల్ ఫండ్స్ అంటే ఏమిటి.. మనం పెట్టుబడి పెట్టిన మొత్తన్ని ఫండ్ మేనేజర్లు స్టాక్ మార్కెట్‎లో పెట్టుబడి పెడతారు. ఇందులో ఎక్కువగా స్మాల్ క్యాపు కంపెనీల్లో పెట్టుబడి పెడతారు. ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజెషన్ 5000 కోట్ల కంటే తక్కువ ఉంటే ఆ కంపెనీలు స్మాల్ క్యాపు కంపెనీలు అంటారు.

Read Also.. Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మారెట్లు.. పెట్టుబడికి ఇదే సరైన సమయమా..!

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం