Lord Ganesha: విఘ్నాలకధిపతి వినాయకుడి జీవితం నుంచి ఈ విషయాలను నేర్చుకుంటే.. జీవితం సుఖమయం

 Lord Ganesha: విఘ్నేశ్వరుడు.. హిందువులకు ముఖ్య దేవుడు.. పండగలకు, పంక్షన్లకు ఏ పని మొదలు పెట్టాలన్నా నిర్విఘ్నంగా జరగడానికి గణేషుడిని కోరుకుంటూ.. తొలి పూజలను..

 Lord Ganesha: విఘ్నాలకధిపతి వినాయకుడి జీవితం నుంచి ఈ విషయాలను నేర్చుకుంటే.. జీవితం సుఖమయం
Ganesha
Follow us

|

Updated on: Oct 01, 2021 | 11:55 AM

Lord Ganesha: విఘ్నేశ్వరుడు.. హిందువులకు ముఖ్య దేవుడు.. పండగలకు, పంక్షన్లకు ఏ పని మొదలు పెట్టాలన్నా నిర్విఘ్నంగా జరగడానికి గణేషుడిని కోరుకుంటూ.. తొలి పూజలను నిర్వహిస్తారు. శివపార్వతుల తనయుడు వినాయకుడి జీవితం నుంచి మనుషులు ముఖ్యమైన విషయాలను ప్రేరణగా తీసుకోవాలి. వాటిని ఆచరిస్తూ.. మనిషి ఉన్నత స్థితికి చేరుకోవచ్చు.. ఈరోజు మనిషి నిత్య జీవితంలో వినాయకుడి నుంచి ప్రేరణగా తీసుకునే ముఖ్య విషయాలు ఏమిటో చూద్దాం..

లక్ష్య సాధనలో విధి నిర్వహణ ముందు:

పార్వతి దేవి పిండిబొమ్మకు ప్రాణం పోసి.. ఆ బాలుడిని కాపలా ఉంచి స్నానానికి వెళ్తుంది. ఆ సమయంలో పరమేశ్వరుడు లోపలి వెళ్ళబోతే అడ్డుకున్నాడు చిన్నారి బాలుడు. అప్పుడు శివుడు తన గురించి చెప్పి.. లోపలి వెళ్ళమన్నా.. గణేషుడు వినడు. తనకు తల్లి అప్పగించిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ..సాక్షాత్తూ శివుడే వచ్చినా… గణేషుడు తన ప్రాణాలు పోయినా విధి నిర్వహణను పూర్తి చేశాడు. ఈ గుణంతో మనిషి తెలుసుకోవాల్సింది.. ఒక పని మనకు ఎవరైనా అప్పగిస్తే.. కర్తవ్యనిర్వహణలో వెనుదిరగకూడదు. అప్పుడు మనిషి లక్ష్యసాధనలో, కెరీర్‌లో ముందుకు దూసుకెళ్తాడు.

ప్రపంచంలో తల్లిదండ్రులదే మొదటి స్థానం: 

గణాధిపతిగా నియామకం కోసం తల్లిదండ్రులు శివ పార్వతులు తనయులకు గణేషుడు, కుమారస్వామిలకు ముల్లోకాల్లో ఉన్న పుణ్య క్షేత్రాలను చుట్టిరావాలని పరీక్ష పెడతారు. దీంతో కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై యాత్రలకు బయలు దేరగా.. గణేషుడు మాత్రం తల్లిదండ్రులైన శివపార్వతులనే దేవుళ్లుగా భావించి వారి చుట్టూ మూడు ప్రదక్షణాలతో ముల్లోకాల పుణ్యక్షేత్రాలను చుట్టివస్తాడు. గణాధిపతి అయ్యాడు. ఈ గుణం నుంచి ప్రస్తుత జనరేషన్ తెలుసుకోవాల్సింది.. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను దైవంగా భావించి జాగ్రత్తగా చూసుకోవాలని తెలుస్తోంది.

తప్పుచేసిన వారిని క్షమించే గుణం: 

తనను చూసిన నవ్విన చంద్రుడిని క్షమించడంతో వినాయకుడు.. నుంచి  మనిషి నేర్చుకోవాల్సింది.. తమను ఎగతాళి చేసేవారిని క్షమించే గుణం నేర్చుకోవాలి.

చేపట్టి పనిని పూర్తిచేయడం

వేద వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని వినాయకుడు  గ్రంథంగా రాస్తున్న సమయంలో ఘంటం విరిగినా గ్రంధస్తం చేసే సమయంలో.. గణేషుడు తన దంతాల్లోంచి ఒక దాన్ని విరిచి గ్రంథం రాయడం పూర్తి చేశాడు. అంతేకాని మధ్యలో ఆగిపోలేదు. దీంతో మనిషి నేర్చుకోవాల్సింది.. ఏ పనిచేపట్టినా, ఎన్ని అవరోధాలు వచ్చినా వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి. మధ్యలో ఆగకూడదు.

ఆత్మ గౌరవం: 

ఒకసారి శ్రీమహావిష్ణువు ఇంట్లో జరిగే శుభ కార్యానికి దేవతలందరూ వెళ్తూ..  స్వర్గలోకానికి గణేషున్ని కాపలాగా ఉంచుతారు. దీనికి కారణం తన ఆకారమే అని గణేశుడికి తెలుస్తుంది. ఎలాగైనా దేవతలకు గుణపాఠం  చెప్పాలనుకుని.. వారు వెళ్లే అన్నీ గుంతలు ఏర్పడేలా చేయమని మూషికాన్ని ఆదేశిస్తాడు. మూషికం దేవతలు వెళ్లే దారిలో గుంతలు చేయడంతో.. ఆ గుంతల్లో దేవతల రథం దిగబడుతుంది. దీంతో ఎంతమంది దేవతలు కలిసినా ఆ రథాన్ని బయటకు తీయలేరు.. అటుగా వెళ్తున్న ఓ రైతును పిలిచి సహాయం చేయమంటారు. ఆ ఆవ్యక్తి.. గణేషున్ని ప్రార్థించి ఒక్క ఉదుటున గుంతలో దిగబడి ఉన్న రథాన్ని బయటకు లాగుతాడు. అప్పుడు దీనికి కారణం అవరోధాలను తొలగించే దైవం వినాయకుడిని ప్రార్ధించడమే అని చెప్పడంతో దేవతలకు తమ తప్పు తెలుస్తుంది. వినాయకుడి క్షమించమని కోరతారు.  వినాయకుడు తన ఆత్మ గౌరవంతో ప్రవర్తించిన తీరు ఎట్టి  పరిస్థితిలోనైనా ఆత్మ గౌరవాన్ని మనం కోల్పోకూడదని వినాయకుడి జీవితంలో జరిగిన ఆ సంఘటన మనకు ఆదర్శంగా నిలుస్తుంది.

Also Read: Piles Ayurveda Tips: ఫైల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. నివారణకు ఆయుర్వేదంలో సింపుల్ చిట్కాలు..

Horoscope October 2021: ఈ నెలలో ఈ రాశివారికి స్టాక్ మార్కెట్‌లో భారీ నష్టాలు.. ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో