TTD: బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల.. ఈ నెల11న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం
Tirumala Varshika Brahmotsavam: ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తిరుమల కు చేరుకుని ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం..
తిరుమల శ్రీవారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. అక్టోబరు 7 నుంచి 15వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కొవిడ్ నేపథ్యంలో భక్తులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా వాహనసేవలను ఆలయంలోని కళ్యాణ వేదికలోనే నిర్వహించనున్నారు. వాహన సేవలు ఆలయంలో నిర్వహిస్తున్నప్పటికీ తిరుమలలో పండుగ వాతావరణం నెలకొనేలా కొద్దిపాటి ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తిరుమల కు చేరుకుని ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 11న జరిగే గరుడ సేవలో సీఎం జగన్ పాల్గొంటారని వెల్లడించారు.
ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుడుతారని ఆయన తెలిపారు. ఇందులో అలిపిరి వద్ద నిర్మించిన గో మందిరాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం అలిపిరి నడక మార్గంలో చిన్న పిల్లల చికిత్స కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శాలను ఆయన ప్రారంభిస్తారు. వీటితోపాటు నూతన బూందీ పోటు, ఎస్వీబిసి కన్నడ, హిందీ ఛానల్లను కూడా ప్రారంభిస్తారని ఈవో తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని… కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తో దర్శనానికి రావాన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
ఏడో తేదీన ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. రాత్రికి పెద్దశేష వాహన సేవ, 8న ఉదయం చిన్నశేషవాహన సేవ, రాత్రి హంసవాహన సేవను నిర్వహిస్తారు. అలాగే 9న సింహవాహ నం, రాత్రి ముత్యపు పందిరి, 10న ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రి సర్వ భూపాల వాహనం, 11న మోహినీ అవతారం, రాత్రి గరుడవాహనసేవ, 12న ఉదయం హనుమంతవాహనం, సాయంత్రం స్వర్ణరథం బదులుగా సర్వ భూపాల వాహనం, రాత్రి గజవాహనసేవలను నిర్వహిస్తారు. 13న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 14న ఉదయం రథం బదు లుగా సర్వభూపాల వాహనం, రాత్రి అశ్వవాహనం, చివరిరోజు 15వ తేదీన ఉదయం చక్రస్నానం నిర్వహించి, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాల ను పూర్తిచేయనున్నారు.
ఇవి కూడా చదవండి: SBI Car Loan: కారు కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. జీరో ప్రాసెసింగ్ ఛార్జ్.. ఇంట్లో కూర్చుని తీసుకోండి..
TS RTC: సాహో సజ్జనార్.. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు..