Diwali: దీపావళికి నో క్రాకర్స్‌.. ఇవాల్టి నుంచే ఆదేశాలు అమల్లోకి

ఎకో గణపతి తరహాలోనే దివాలీ.. ఎస్‌.. ఈసారి కూడా దీపావళికి నో క్రాకర్స్‌. కేవలం దీపాల వెలుగులు మాత్రమే. బాణా సంచా అమ్మినా, కాల్చినా చర్యలు తప్పవు.

Diwali: దీపావళికి నో క్రాకర్స్‌.. ఇవాల్టి నుంచే ఆదేశాలు అమల్లోకి
Diwali
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 01, 2021 | 1:36 PM

Diwali: ఎకో గణపతి తరహాలోనే దివాలీ.. ఎస్‌.. ఈసారి కూడా దీపావళికి నో క్రాకర్స్‌. కేవలం దీపాల వెలుగులు మాత్రమే. బాణా సంచా అమ్మినా, కాల్చినా చర్యలు తప్పవు. కరోనా థర్డ్‌వేవ్‌ హెచ్చరికలతో రాజస్థాన్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. టపాసుల అమ్మకాలపై నిషేధం విధించింది ఢిల్లీ ప్రభుత్వం. తాజాగా అదే ఐడియాలజీలోకి వచ్చేసింది రాజస్థాన్. కరోనా కారణంగా క్రాకర్స్‌పై బ్యాన్ విధించింది. ఇవాల్టి నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చేశాయి. వచ్చే ఏడాది జనవరి 31 వరకూ బాణాసంచాపై ఈ నిషేధం అమలులో ఉంటుంది.

పండుగల సీజన్‌లో కరోనా థర్డ్‌ వేవ్‌ భయంతో పాటు ఎయిర్‌ పొల్యూషన్‌తో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు సీఎం అశోక్‌ గెహ్లాట్‌. రాష్ట్రంలో ఇవాల్టి నుంచి బాణాసంచా అమ్మడం, కాల్చడం, నిల్వచేయడాన్ని పూర్తిగా నిషేదిస్తున్నట్లు వెల్లడించారు. టపాసుల నుంచి వెలువడే కాలుష్యం ఊపిరితిత్తులపై పెను ప్రభావం చూపుతుందని..ప్రజలు శ్వాసకోస సమస్యల బారిన పడే అవకాశముందని తెలిపారు. కరోనాతో ఇప్పటికే ప్రజల రోగనిరోధక శక్తి తగ్గిందని, అందుకే, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

ఐతే కొన్ని రోజుల క్రితం ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1 వరకూ బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్లు సెప్టెంబర్‌ 15న ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్‌ కారణంగా పటాకులు పేల్చడం వల్ల వాయు కాలుష్యం వల్ల పెరిగిపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు. గతేడాది బాణసంచాపై నిషేధం విధించడం ఆలస్యమైనందువల్ల కొందరు వ్యాపారులకు నష్టం జరిగిందన్నారు.

ఈ ఏడాది కూడా సంపూర్ణ నిషేధం విధించినందువల్ల..ఎవరూ బాణసంచాను నిల్వ చేయవద్దని, అమ్మవద్దని కోరారు కేజ్రీవాల్. ప్రజారోగ్యం దృష్ట్యా ఇలాంటి చర్చలు తప్పవని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అయితే పండుగల వేళ ఇలా బాణసంచాపై నిషేధం విధించడం పట్ల కొందరు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Read also: Pawan Kalyan: మిగిలిన రోడ్ల సంగతేంటి.. ఏపీ సర్కార్‌ను ప్రశ్నించిన జనసేన