Indian Army Recruitment: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. అర్హులెవరు.? ఎలా అప్లై చేసుకోవాలంటే..
Indian Army Recruitment 2021: ఇండియన్ ఆర్మీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ (ఓటీఏ) 2022 ఏడాదికి గాను ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు...
Indian Army Recruitment 2021: ఇండియన్ ఆర్మీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ (ఓటీఏ) 2022 ఏడాదికి గాను ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 191 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారభమైన నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 191 ఖాళీలకుగా ను షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) మెన్ – 175, ఎస్‌ఎస్‌సీ (టెక్) ఉమెన్ – 14, విడోస్ డిఫెన్స్ పర్సనల్ (02) పోస్టులు ఉన్నాయి.
* ఎస్‌ఎస్‌సీ (టెక్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎస్‌ఎస్‌సీ విడోస్ (నాన్ టెక్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్, ఎస్‌ఎస్‌సీ విడో (టెక్నికల్) – బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* ఎస్‌ఎస్‌సీ (టెక్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు వయసు 01-04-2022 నాటికి 20-27 ఏళ్ల మధ్య ఉండాలి. మిగత పోస్టులకు 01-04-2022 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను చివరి సెమిస్టర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ 28-09-2021న ప్రారంభంకాగా 27-10-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
AP Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
Indian Navy: ఇండియన్ నేవీలో 230 ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 1