AP Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

AP Jobs Alert: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. 151 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్...

AP Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
Appsc
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 30, 2021 | 8:59 PM

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. 151 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్‌సీ) తాజాగా విడుదల చేసింది. అయుష్ డిపార్ట్‌మెంట్‌లోని ఆయుర్వేద, హోమియోపతి, యునానీ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు అభ్యర్ధుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఆధారంగా జరగనుంది. అక్టోబర్ 4వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అలాగే దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ అక్టోబర్ 25గా నిర్ణయించింది. కాగా, రాత పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ మరికొద్ది రోజుల్లో ప్రకటించనుంది.

నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి..

  • పోస్టులు – 151(మెడికల్ ఆఫీసర్(యునానీ) -26, (హోమియోపతి) – 53, (ఆయుర్వేద) – 72)

  • విద్యార్హత – సంబంధిత డిగ్రీతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్, మెడికల్ ప్రాక్టీషనర్‌గా రిజిస్ట్రేషన్

  • దరఖాస్తు ప్రారంభ తేదీ- అక్టోబర్ 4, 2021

  • అప్లికేషన్స్ స్వీకరణకు లాస్ట్ డేట్- అక్టోబర్ 25, 2021

  • వయస్సు: 18-42 ఏళ్లు (2021 జూలై 1 నాటికి)

  • దరఖాస్తు ఫీజు – రూ. 250, ఎగ్జామ్ ఫీజ్ – రూ. 120

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు

  • ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్

  • అఫీషియల్ వెబ్‌సైట్ – https://psc.ap.gov.in/