Boy Kidnap: 9 నెలల బాలుడి కిడ్నాప్.. ఆచూకీ కోసం ఐదు టీమ్‌లు.. తెనాలి వైపు తీసుకెళ్లినట్టు అనుమానం
ఈ బ్రేకింగ్ గుంటూరు జిల్లా నుంచి అందుతోంది. 9 నెలల బాలుడి కిడ్నాప్ అయ్యాడు. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ఈ కిడ్నాప్ చోటుచేసుకుంది.
Boy kidnap – Guntur District: ఈ బ్రేకింగ్ గుంటూరు జిల్లా నుంచి అందుతోంది. 9 నెలల బాలుడి కిడ్నాప్ అయ్యాడు. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ఈ కిడ్నాప్ చోటుచేసుకుంది. 9 నెలల బాలుడిని దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో మంగళగిరి పోలీసుస్టేషన్‌లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాలుడీ ఆచూకీ కోసం ఐదు టీమ్‌లను రంగంలోకి దింపారు పోలీసులు. బాలుడిని బైక్‌పై ఇద్దరు వ్యక్తులు తెనాలి వైపు తీసుకెళ్లినట్లు తల్లి పోలీసులకు తెలిపింది. సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు గుంటూరు జిల్లా పోలీసులు.