Sunishith: సునిశిత్ ఆటకట్టించిన పోలీసులు.. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు.. ఖాకీల జోలికి వస్తే ఊరుకుంటారా మరి..

శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ గుర్తున్నాడా ? యూట్యూబ్ వీడియోలను చూస్తూ... నిత్యం నెట్టింట్లో మునిగితేలేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Sunishith: సునిశిత్ ఆటకట్టించిన పోలీసులు.. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు.. ఖాకీల జోలికి వస్తే ఊరుకుంటారా మరి..
Sunishit
Follow us

|

Updated on: Oct 02, 2021 | 9:12 AM

శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ గుర్తున్నాడా ? యూట్యూబ్ వీడియోలను చూస్తూ… నిత్యం నెట్టింట్లో మునిగితేలేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ స్టార్స్ పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వార్తల్లో నిలిచేవాడు.. ముందు ఆ సినిమా ఛాన్స్ నాకే వచ్చింది.. కానీ.. ఆ స్టార్ హీరో అడిగితే ఆఫర్ ఇచ్చేసా.. ఆ హీరోయిన్‍తో నాకు పెళ్లైంది.. ఎఫైర్ ఉందని,.. తను ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చేశానని వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవాడు. అంతేకాదు.. ఈ సోది స్టార్‏ను ఎన్నో ఛానల్స్ ఇంటర్వ్యూ చేసి అంతా కలసి అప్పట్లో నెట్టింట్లో రచ్చ చేశారు. అయితే ఈ సోదీ స్టార్ గురించి సినీ ప్రముఖులు పెద్దగా పట్టించుకోలేదు. అయినా.. కొందరు హీరోయిన్స్ రియాక్ట్ అయ్యి.. తమపై అసత్య ప్రచారం చేస్తున్న సునిశిత్ పై కేసు పెట్టారు. ఆ తర్వాత శాక్రిఫ్రైజ్ స్టార్ పత్తా లేకుండా పోయాడు.

ఇటీవల సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి.. మళ్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు సునిశిత్.. తాజాగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటివరకు కేవలం సినీ ప్రముఖులు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సునిశిత్.. ఇప్పుడు ఏకంగా ఓ పోలీస్ అధికారిపై తప్పుడు ఆరోపణలు చేశారు.. ఆ ఎస్ఐ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని కీసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తప్పుడు వీడియో ఇచ్చినట్లు నిందుతుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. జనగాం జిల్లాకు చెందిన సునిశిత్.. ఎంటెక్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత.. ఓ కాలేజీలో పనిచేశాడు. అదే సమయంలో ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదలైన తర్వాత 2014లో తన నివాసాన్ని రాంపల్లి ఆర్ఎల్ నగర్ కు మార్చాడు. అక్కడే ఫిల్మ్ ఇన్‏స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నాడు. ఇక రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలనుకున్నాడు. దీంతో ఏకంగా సినీ ప్రముఖులనే ఎంచుకున్నాడు. వారిపై ఆరోపణలు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే తొందరగా స్టా్ర్ గా మారొచ్చు అనుకున్నాడు. అంతే అనుకున్నదే తడవుగా టాలీవుడ్ పాపులర్ నటీనటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతనిపై కేసు నమోదై జైలుకు వెళ్లాడు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత.. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి.. మళ్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల మల్కాజ్ గిరి స్టేషన్ లో పనిచేసే ఓ పోలీస్ అధికారిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. వీడియోలను రిలీజ్ చేశాడు. దీంతో ఆ అధికారి ఇచ్చి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కీసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తప్పుడు వీడియో ఇచ్చినట్లుగా సునిశిత్ ఒప్పుకున్నాడని కీసర సీఐ నరేందర్ గౌడ్ తెలిపారు.

Also Read: Leharaayi Song: యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టిస్తున్న అఖిల్ సాంగ్.. మిలియన్ వ్యూస్ అందుకుంటున్న లెహరాయి పాట..

Bigg Boss 5 Telugu:  మోడల్ నిజంగానే ఇన్‏ఫ్లూయెన్స్ అవుతున్నాడా ?.. మరోసారి జైలుకు వెళ్లిన జెస్సీ..