Leharaayi Song: యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టిస్తున్న అఖిల్ సాంగ్.. మిలియన్ వ్యూస్ అందుకుంటున్న లెహరాయి పాట..

అఖిల్ అక్కినేని.. ఎలాగైనా హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అఖిల్ కెరీర్‏లో ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. దీంతో ప్రస్తుతం

Leharaayi Song: యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టిస్తున్న అఖిల్ సాంగ్.. మిలియన్ వ్యూస్ అందుకుంటున్న లెహరాయి పాట..
Leharai Song
Follow us

|

Updated on: Oct 02, 2021 | 7:42 AM

అఖిల్ అక్కినేని.. ఎలాగైనా హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అఖిల్ కెరీర్‏లో ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. దీంతో ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పైనే ఆశలన్ని పెట్టుకున్నాడు. యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏గా వస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‏గా నటిస్తుండగా.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది… అయితే ఇటీవల ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ అనుహ్యంగా విడుదల తేదీని అక్టోబర్ 15 అంటూ మరోసారి ప్రకటించారు మేకర్స్.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్‎కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇటీవల ఈ మూవీని నుంచి విడుదలైన లెహరాయి సాంగ్ యూట్యూబ్‏లో దూసుకుపోతుంది. అతి తక్కువ సమయంలోనే 6 మిలియన్ పై వ్యూ్స్ సొంతం చేసుకుని యూట్యూబ్‏లో ట్రెండ్ అవుతుంది. అతి తక్కువ సమయంలోనే లెహరాయి సాంగ్ నెట్టింట్లో హావా కొనసాగిస్తోంది. లెహరాయి లెహరాయి.. గుండె ఊహలెగిరాయి.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి.. గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి.. ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి.. కళ్ళలోన దాగి ఉన్న అమ్మాయి.. సొంతమల్లె చేరుతుంటే.. ప్రాణమంత చెప్పలేని హాయి… అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుకుంటూ యూట్యూబ్‏లో ట్రెండింగ్ 4లో కొనసాగుతుంది. ఈ పాటను సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆమని, ఈషారెబ్బా, చిన్మయి కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Also Read: Bigg Boss 5 Telugu:  మోడల్ నిజంగానే ఇన్‏ఫ్లూయెన్స్ అవుతున్నాడా ?.. మరోసారి జైలుకు వెళ్లిన జెస్సీ..

Jai Bheem Suriya: మోస్ట్‌ వెయిటింగ్‌ మూవీ అమెజాన్‌లో వచ్చేస్తోంది.. సూర్య ‘జై భీమ్‌’ విడుదల ఎప్పుడంటే..

Konda Polam: ఫుల్ స్వింగ్‌లో వైష్ణ‌వ్ తేజ్‌- ర‌కుల్ ప్రీత్ సింగ్‌ ‘కొండపోలం’ ప్రమోషన్స్..