AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jai Bheem Suriya: మోస్ట్‌ వెయిటింగ్‌ మూవీ అమెజాన్‌లో వచ్చేస్తోంది.. సూర్య ‘జై భీమ్‌’ విడుదల ఎప్పుడంటే..

Jai Bheem Suriya: కథల ఎంపికలో వైవిధ్యత, సహజ నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హీరో సూర్య. సినిమా సినిమాకు కథల ఎంపికలో వైవిధ్యతను కనబరుస్తూ సౌత్‌ ఇండియన్‌ సిల్వర్‌..

Jai Bheem Suriya: మోస్ట్‌ వెయిటింగ్‌ మూవీ అమెజాన్‌లో వచ్చేస్తోంది.. సూర్య 'జై భీమ్‌' విడుదల ఎప్పుడంటే..
Jai Bhim Review
Narender Vaitla
|

Updated on: Oct 02, 2021 | 6:41 AM

Share

Jai Bheem Suriya: కథల ఎంపికలో వైవిధ్యత, సహజ నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హీరో సూర్య. సినిమా సినిమాకు కథల ఎంపికలో వైవిధ్యతను కనబరుస్తూ సౌత్‌ ఇండియన్‌ సిల్వర్‌ స్క్రిన్‌పై తన మార్క్‌ను చూపిస్తూ వస్తోన్న సూర్య తాజాగా నటిస్తోన్న చిత్రం ‘జై భీమ్‌’. సోషల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టీజే జ్ఙానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సూర్య నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. మొదట్లో సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. కానీ.. అమెజాన్‌ వేదికగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా అమెజాన్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. దీపావళి కానుకగా ఈ సినిమాను నవంబర్‌ 2న విడుదల చేయనున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు. ‘మేము ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి ఎంతో ఆతృతగా ఉన్నాము. ఈ దీపావళికి జైభీమ్‌ను ప్రైమ్‌లో చూడండి’ అంటూ పేర్కొన్నారు. ఈ సినిమాలో ర‌జీష విజ‌య‌న్, లిజోమోల్ జోస్ కీల‌క‌పాత్రల్లో న‌టిస్తున్నారు.

ఇదిలా ఉంటే సూర్య గతంలో నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు యథార్థ సంఘటనల ఆధారంగా వస్తోన్న మరో చిత్రం ‘జై భీమ్‌’పై ఇండస్ట్రీ దృష్టి పడింది. మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Also Read: Konda Polam: ఫుల్ స్వింగ్‌లో వైష్ణ‌వ్ తేజ్‌- ర‌కుల్ ప్రీత్ సింగ్‌ ‘కొండపోలం’ ప్రమోషన్స్..

Divi Vadthya : చిలకపచ్చ ఓణిలో రామచిలక .. ఈ బిగ్ బాస్ బ్యూటీ అందానికి ఫిదా కావాల్సిందే..

ఈ చిన్నారి ఇప్పుడు చాలా ఫేమస్.. టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్స్‌ అందుకుంది.. ఎవరో గుర్తుపట్టారా.!