Konda Polam: ఫుల్ స్వింగ్‌లో వైష్ణ‌వ్ తేజ్‌- ర‌కుల్ ప్రీత్ సింగ్‌ ‘కొండపోలం’ ప్రమోషన్స్..

ఉప్పెన వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత  మెగాసెన్సేష‌న్  వైష్ణవ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న రెండవ చిత్రం `కొండపొలం` పై భారీ అంచనాలు ఉన్నాయి.

Konda Polam: ఫుల్ స్వింగ్‌లో వైష్ణ‌వ్ తేజ్‌- ర‌కుల్ ప్రీత్ సింగ్‌ 'కొండపోలం' ప్రమోషన్స్..
Konda Polam Movie Review
Rajeev Rayala

|

Oct 01, 2021 | 10:09 PM

Konda Polam: ఉప్పెన వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత  మెగాసెన్సేష‌న్  వైష్ణవ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న రెండవ చిత్రం `కొండపొలం` పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన యాక్షన్ మ‌రియు అడ్వెంచ‌ర‌స్ చిత్రానికి  క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 8న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. దీంతో  ప్రమోషన్స్  ఫుల్ స్వింగ్‌లో జ‌రుగుతున్నాయి. తాజాగా కొండ‌పొలం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఈ మూవీకి సెన్సారు వారు ఎలాంటి క‌ట్స్ చెప్ప‌కుండా క్లీన్ యూ స‌ర్టిఫికేట్ ఇవ్వ‌డంతో పాటు సినిమా చూసి మేకర్స్‌ను ప్రశంసించారు. కొండ‌పొలం  2:15గంట‌ల ప‌ర్‌ఫెక్ట్ ర‌న్‌టైమ్‌తో ప్రేక్ష‌కుల‌ముందుకు రాబోతుంది.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్  మ‌రియు  ‘ఓబులమ్మ’ ‘శ్వాసలో’ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. అలాగే సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండ పొలం’ నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రిష్. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్న ఈ మూవీ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోంది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ అందించగా.. రాజ్ కుమార్ గిబ్సన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. శ్రవణ్ కటికనేని దీనికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kiara Advani : సౌత్‌లో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ.. కియారా చేతిలో మరో భారీ మూవీ.?

Pelli SandaD: ద‌స‌రా కానుకగా థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నున్న రాఘవేంద్రరావు ‘పెళ్లిసంద‌D’…

Maa Elections 2021: పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి.. ప్రకాష్ రాజ్ వార్నింగ్

Sadha: క్యాజువల్ లుక్స్‌తోనే ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్న సదా అందాలు.. మీరు ఓ లుక్ వేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu