Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్స్‏ను జంతువులతో పోలుస్తున్న నటరాజ్ మాస్టర్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Oct 02, 2021 | 8:23 AM

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్‏కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషలలో ఈ షో సక్సెస్‏ఫుల్‏గా

Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్స్‏ను జంతువులతో పోలుస్తున్న నటరాజ్ మాస్టర్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్..
Natraj Master

Follow us on

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్‏కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషలలో ఈ షో సక్సెస్‏ఫుల్‏గా దూసుకుపోతుంది. ఇటీవల అయితే ఈసారి తెలుగులో ప్రారంభమైన బిగ్‏బాస్ షో పై మాత్రం ప్రేక్షకులను అసహనం వ్యక్తం చేస్తున్నారు. షో మొదటి నుంచి చప్పగా సాగుతుందని.. ఇప్పటికీ కంటెస్టెంట్స్ తీరు అర్థం కావడం లేదని.. షో చూడాలంటే చిరాకు వస్తుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మూడు ఎలిమినేషన్స్ జరిగి.. నాలుగోవారం ఎలిమినేషన్ సమయం కూడా దగ్గర పడింది. అయినా కంటెస్టెంట్స్ ఆట తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇదిలా ఉంటే.. ఈసారి ఇంట్లోకి సగానికి పైగా తెలియాని ముఖాలు ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే వారిని జనాలు అలవాటు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. కాస్త పాపులారిటీ ఉన్న నటరాజ్ మాస్టర్ తీరుపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంటిని జంతుప్రదర్శనశాలగా మార్చేస్తున్నాడు . ఒక్కో కంటెస్టెంట్‏ను జంతువులతో పోలుస్తూ అందరికీ ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు. తన జోలికి వస్తే అస్సలు వదిలిపెట్టకుండా.. ఓ ఆట ఆడుకుంటున్నాడు. ఇక అదే వివాదాన్ని అక్కడితో ఆపేయకుండా.. కోనసాగిస్తున్నాడు. ఇక తనకు నచ్చని వారిని జంతువులతో పోలుస్తూ.. వారికి ఇష్టానుసారంగా పేర్లు పెడుతుంటాడు. మొదటి వారంలో ఇంట్లో గుంటనక్క ఉందని… ఆ తర్వాత ఊసరవెళ్లి ఉందని.. ఇలా ఇష్టానుసారంగా పేర్లు పెడుతూ.. ఇంటి సభ్యులకు చిరాకు తెప్పిస్తున్నాడు.

దీంతో నటరాజ్ మాస్టర్ పై అటు ఇంట్లో, ఇటు బయట వ్యతిరేకత పెరుగుతుంది. గతంలో రవిని గుంటనక్క అని.. విశ్వను ఊసరవెళ్లి అని పోల్చిన మాస్టర్.. ఇప్పుడు మరోసారి రవి పై తన జంతుప్రదర్శనశాల టాలెంట్ చూపించాడు.. తనదైన స్టైల్లో వివరిస్తూ మరి.. రవిని నత్తతో పోల్చాడు. దీంతో మాస్టర్ తనకు చిరాకు తెప్పిస్తున్నాడని మిగతా సభ్యులతో చెప్పుకొచ్చాడు రవి.. ఇక నెటిజన్స్ కూడా నటరాజ్ మాస్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అతని ప్రవర్తన సరిగ్గా లేదని.. ఒకట్రెండు సార్లు అంటే ఊరుకొవచ్చు కానీ.. ఇలా ప్రతిసారీ ఇష్టానుసారంగా పేర్లు పెడుతూ.. జంతువులతో పోల్చడం ఏంటీ అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఈసారి ఎలిమినేషన్ డేంజర్ జోన్‎లో నటరాజ్ మాస్టర్ రెండవస్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో యానీ మాస్టర్ ఉంది. ఒకవేళ.. బిగ్‏బాస్ లెక్కల్లో తేడా వచ్చి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు.

Also Read: Leharaayi Song: యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టిస్తున్న అఖిల్ సాంగ్.. మిలియన్ వ్యూస్ అందుకుంటున్న లెహరాయి పాట..

Bigg Boss 5 Telugu:  మోడల్ నిజంగానే ఇన్‏ఫ్లూయెన్స్ అవుతున్నాడా ?.. మరోసారి జైలుకు వెళ్లిన జెస్సీ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu