Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu:  మోడల్ నిజంగానే ఇన్‏ఫ్లూయెన్స్ అవుతున్నాడా ?.. మరోసారి జైలుకు వెళ్లిన జెస్సీ..

మొత్తానికి ఇంటి సభ్యుల మధ్య ఫిటింగ్స్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తుగడలను సంధీస్తాడు. గత రెండు రోజులుగా ఆకలితో

Bigg Boss 5 Telugu:  మోడల్ నిజంగానే ఇన్‏ఫ్లూయెన్స్ అవుతున్నాడా ?.. మరోసారి జైలుకు వెళ్లిన జెస్సీ..
Jessie
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 02, 2021 | 7:19 AM

మొత్తానికి ఇంటి సభ్యుల మధ్య ఫిటింగ్స్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తుగడలను సంధీస్తాడు. గత రెండు రోజులుగా ఆకలితో అలమటించేలా చేసి.. ఆ తర్వాత.. తాపీగా.. టాస్క్ ముగిసింది అంటూ ఇంటి సభ్యులకు విముక్తి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తర్వాత జంటల నుంచి ఒక్కోక్కరిని ఎంచుకోవడం.. అందరూ కలిసి సన్నీ కెప్టెన్‏గా పనికిరాడని చెప్పేశారు. దీంతో ఇంటి కెప్టెన్‏గా ఎన్నికయిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్‏లో ఇంట్లో స్పెషల్ షో ఏర్పాటు చేశాడు. ఈ షోకు సన్నీ వీజేగా వ్యవహరించగా.. అతిథిగా శ్రీరామచంద్ర విచ్చేశాడు. ఈ స్పెషల్ షోతో ఇంటి సభ్యులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. అలాగే బెస్ట్, వరస్ట్ అంటూ మరోసారి ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. అసలు నిన్నటి ఎపిసోడ్‏లో ఏం జరిగిందో తెలుసుకుందామా.

నిన్నటి ఎపిసోడ్‏లో కెప్టెన్సీ అంటే ఇమ్యూనిటీ అని.. అలాంటి కెప్టెన్సీ తనకు రాకుండా చేసిన కాజల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది శ్వేత. నువ్వు నీ మైండ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నావని.. కానీ మనసును కాదని కాజల్ పై మండిపడింది. దీంతో .. నేను శ్రీరామచంద్ర గెలవాలనుకున్నా.. అంతే కానీ నీ ఫీలింగ్స్ నాకు అవసరం లేదంటూ..ముఖం మీదే చెప్పేసింది. ఇదిలా ఉంటే.. రాత్రి అందరూ పడుకున్నాక.. హమీదా.. శ్రీరామచంద్ర గాల్లో ఫ్లై కిసెస్ పంపుకుని గుడ్ నైట్ చెప్పుకున్నారు. ఇక ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ ఎప్పటిలాగే .. తనకు నచ్చని వారిని జంతువులతో పోల్చాడు. అంతేకాకుండా.. రవిని నత్త అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో హర్ట్ అయిన రవి.. మాస్టర్ తనను చాలా ఇరిటేట్ చేస్తున్నాడని.. అసలు తన పేరు తీయోద్దని… ఆయనతో చెప్పాలని లోబోకు సూచించాడు.

అనంతరం.. ఈవారం బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ఎంచుకోవాలని ఆదేశించాడు బిగ్ బాస్. దీంతో శ్రీరామ్-హమిదా… జెస్సీని వరస్ట్, లోబోను బెస్ట్ పర్ఫామర్లుగా ఎంచుకున్నారు. ఆ తర్వాత యానీ మాస్టర్-శ్వేత.. శ్రీరామ్ బెస్ట్.. కాజల్ వరస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. విశ్వ-రవి.. మానస్‌ను బెస్ట్‌, జెస్సీని వరస్ట్‌ పర్ఫామర్లుగా తెలిపారు.. ఇక అనంతరం షణ్ముఖ్-సిరి.. మానస్ బెస్ట్.. లోబో వరస్ట్ అని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన లోబో-నటరాజ్ మాస్టర్.. మానస్ బెస్ట్.. జెస్సీ వరస్ట్ పర్ఫామర్లుగా ఎంచుకున్నారు. ఇక కాజల్-జెస్సీ.. మానస్ బెస్ట్.. లోబో వరస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత.. ప్రియ, ప్రియాంక.. మానస్ బెస్ట్ అని.. లోబో వరస్ట్ అని పేర్కోన్నారు. ఇక లోబో-మానస్.. లోబో బెస్ట్ అని.. జెన్సీ వరస్ట్ అని.. వేరేవాళ్ల నుంచి ఇన్‏ప్లూయెన్స్ అవుతున్నాడని తెలిపారు. దీంతో ఈ వారం బెస్ట్ పర్ఫామర్‏గా మానస్‏ను.. వరస్ట్ పర్ఫామర్‏గా జెస్సీ ఎంపికయ్యారు. దీంతో రెండోసారి జైలుకు వెళ్లాడు జెస్సీ.

Also Read: Kangana Ranaut: యూపీ సీఎంతో కంగనా రనౌత్ భేటీ.. ప్రభుత్వ పథకానికి బ్రాండ్ అంబాసిడర్‌‌గా నియామకం

Bigg Boss 5 Telugu: కమిటెడ్ కాకపోయి ఉంటే ఆమెకు ట్రై చేసేవాడిని.. మనసులో మాటలను బయటపెట్టిన శ్రీరామ్..