Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut: యూపీ సీఎంతో కంగనా రనౌత్ భేటీ.. ప్రభుత్వ పథకానికి బ్రాండ్ అంబాసిడర్‌‌గా నియామకం

Kangana Meets UP CM Yogi: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీకి మరింత దగ్గరకు జరిగారు. గతంలోనే బీజేపీ పట్ల తన సానుకూలతను ఆమె పలుసార్లు బాహటంగానే వ్యక్తంచేశారు.

Kangana Ranaut: యూపీ సీఎంతో కంగనా రనౌత్ భేటీ.. ప్రభుత్వ పథకానికి బ్రాండ్ అంబాసిడర్‌‌గా నియామకం
Kangana Meets Yogi
Follow us
Janardhan Veluru

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 6:24 PM

Kangana Ranaut meets UP CM Yogi Adityanath: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీకి మరింత దగ్గరకు జరిగారు. గతంలోనే బీజేపీ పట్ల తన సానుకూలతను ఆమె పలుసార్లు బాహటంగానే వ్యక్తంచేశారు. అయితే తాను బీజేపీలో చేరనున్నట్లు జరిగిన ప్రచారాన్ని మాత్రం ఎప్పటికప్పుడు తోసిపుచ్చారు. తలైవి సినిమా తర్వాత ధివంగత జయలలితలానే కంగనా రనౌత్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. పొలిటికల్ ఎంట్రీకి ఆమె నిర్ణయం తీసుకుంటే.. బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని రాజకీయ పండితులు విశ్లేషించారు. అయితే ఇప్పట్లో తనకు రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ఆలోచన లేదని స్పష్టంచేసిన కంగనా.. అయినా ప్రజలు కోరుకుంటేనే అది జరుగుతుందని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో కంగనా శుక్రవారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో లక్నోలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ భేటీ జరగడం రాజకీయ కాకరేపుతోంది. భేటీ తర్వాత ఓ ప్రభుత్వ పథకానికి కంగనాను బ్రాండ్ అంబాసిడర్‌గా నయమించినట్లు యూపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ (ODOP) పథకానికి కంగనాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవరిస్తారని తెలిపింది.

ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్న కంగనా..

సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ సందర్భంగా.. ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉందంటూ కంగనా మెచ్చుకున్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.  మరీ ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కంగనా రనౌత్‌ సేవలను వినియోగించుకోవాలన్న యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన కంగనా రనౌత్..

Also Read..

Bigg Boss 5 Telugu: కమిటెడ్ కాకపోయి ఉంటే ఆమెకు ట్రై చేసేవాడిని.. మనసులో మాటలను బయటపెట్టిన శ్రీరామ్..

Jai Bheem Suriya: మోస్ట్‌ వెయిటింగ్‌ మూవీ అమెజాన్‌లో వచ్చేస్తోంది.. సూర్య ‘జై భీమ్‌’ విడుదల ఎప్పుడంటే..