APPSC Recruitment DPRO: ఆంధ్రప్రదేశ్‌లో డీపీఆర్‌ఓ పోస్టులు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

APPSC Recruitment DPRO: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏపీ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా..

APPSC Recruitment DPRO: ఆంధ్రప్రదేశ్‌లో డీపీఆర్‌ఓ పోస్టులు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 02, 2021 | 12:02 PM

APPSC Recruitment DPRO: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏపీ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ పోస్టులను రిక్రూట్‌ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఆర్ట్స్‌/ సైన్స్‌ / కామర్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా జర్నలిజంలో మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించింది. * అభ్యర్థుల వయసు 01-07-2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 19-10-2021న మొదలుకాగా, చివరి తేదీగా 09-11-2021గా నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

పరీక్ష విధానం..

పరీక్షను మొత్తం మూడు పేపర్‌లుగా నిర్వహిస్తారు.. * పేపర్‌ 1లో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 150 ప్రశ్నలకుగాను 150 మార్కులు ఉంటాయి. * పేపర్‌ 2లో జర్నలిజం/ పబ్లిక్‌ రిలేషన్‌ నుంచి అడుగుతారు. 150 ప్రశ్నలకు గాను 150 మార్కులు ఉంటాయి. * పేపర్‌ 3లో తెలుగు, ఇంగ్లిష్‌ డిస్క్రిప్టివ్‌ పరీక్ష ఉంటుంది. 150 మార్కులకు నిర్వహిస్తారు.

Also Read: EBC Nestham Scheme: అగ్రకుల మహిళలకు గుడ్ న్యూస్.. ఈబీసీ నేస్తం కోసం దరఖాస్తులకు ఆహ్వానం..

BECIL Recruitment: ఎనిమిదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. బీఈసీఐఎల్‌ జాబ్‌ నోటిఫికేషన్‌ పూర్తి వివరాలు..

ECIL Recruitment: హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.