IDBI Bank AM Result 2021: అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
IDBI Bank AM Result 2021: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు
IDBI Bank AM Result 2021: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ idbibank.in ని సందర్శించడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా IDBI బ్యాంకు 650 పోస్టులను భర్తీ చేస్తోంది. ఆగస్టు 10, 2021న నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేయడానికి ఆగస్టు 22 వరకు సమయం ఇచ్చారు.
ఫలితాలను ఇలా తెలుసుకోండి.. 1. IDBI అధికారిక వెబ్‌సైట్ idbibank.in కి లాగిన్ అవ్వండి. 2. హోమ్ పేజీలో IDBI బ్యాంక్ PGDBF-2021-22 లో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి. 3. ఇప్పుడు ఆన్‌లైన్ పరీక్ష ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి. 4. అభ్యర్థించిన వివరాలను పూరించడం ద్వారా లాగిన్ అవ్వండి 5. లాగిన్ అయిన వెంటనే ఫలితం తెరపై కనిపిస్తుంది 6. డౌన్‌లోడ్ చేయండి. తదుపరి ఉపయోగం కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఖాళీల వివరాలు విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఐడిబిఐ బ్యాంక్ 650 అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తుంది. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 265 సీట్లు, OBC అభ్యర్థులకు 175 సీట్లు, ఆర్థికంగా బలహీనమైన వారికి 65, EWS, SC వర్గానికి 97, ST కి 48 సీట్లు కేటాయించారు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు పొందుతారు.