AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Corona: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. ఆ రాష్ట్రంలోనే 60 శాతానికిపైగా కేసులు.. నిన్న ఎన్నంటే..?

India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. అనంతరం మళ్లీ

India Corona: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. ఆ రాష్ట్రంలోనే 60 శాతానికిపైగా కేసులు.. నిన్న ఎన్నంటే..?
India Corona
Shaik Madar Saheb
|

Updated on: Oct 02, 2021 | 9:41 AM

Share

India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. అనంతరం మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం 20వేలకు దిగువన నమోదైన కేసులు.. మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 24,354 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే.. 8శాతం కేసులు తగ్గాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా 234 మంది మరణించారు. కాగా.. కేరళ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న దేశంలో నమోదైన కరోనా కేసుల్లో.. కేరళలో 13,834 కేసులు నమోదు కాగా.. 95 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 2,73,889 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. 197 రోజుల అనంతరం యాక్టివ్ కేసుల సంఖ్య ఈ సంఖ్యకు తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,37,91,061 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,48,573 కి పెరిగింది. అయితే.. నిన్న కరోనా నుంచి 25,445 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,30,68,599 కి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89,74కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 14,29,258 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు 57,19,94,990 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

Also Read:

Petrol Diesel Price: మళ్లీ పెట్రో మంట.. వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Boy Kidnap: 9 నెలల బాలుడి కిడ్నాప్‌.. ఆచూకీ కోసం ఐదు టీమ్‌లు.. తెనాలి వైపు తీసుకెళ్లినట్టు అనుమానం

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై