AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price: మళ్లీ పెట్రో మంట.. వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. మూడు వారాల సుధీర్ఘ విరామం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Diesel Price: మళ్లీ పెట్రో మంట.. వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..
Shaik Madar Saheb
|

Updated on: Oct 02, 2021 | 9:14 AM

Share

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. మూడు వారాల సుధీర్ఘ విరామం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడో రోజూ కూడా పెరిగాయి. దేశంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. గురువారం, శుక్రవారంతోపాటు శనివారం కూడా దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో దేశంలో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశీయ పెట్రోలియం కంపెనీలు వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ ధరలు రాష్ట్రాలు విధిస్తున్న పన్నుల ప్రకారం.. మారుతుంటాయి. తాజాగా శనివారం లీట‌ర్ పెట్రోల్ పై 25 పైస‌లు, డీజిల్‌పై 33 పైస‌లు పెరిగింది.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.14 ఉండగా.. డీజిల్ రూ .90.47గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.108.19 కి పెరగగా.. డీజిల్ ధర రూ .98.16 కి చేరింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.77 ఉండగా.. డీజిల్ రూ. 93.57 కి చేరింది. చెన్నైలో పెట్రోల్ ధర రూ .99.80 కి పెరగగా.. డీజిల్ ధర రూ .95.02 కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.26కి పెరగగా.. లీటర్ డీజిల్ ధర రూ. 98.72 కి చేరింది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.29కి పెరగగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.98.74కి చేరింది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.77 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.25గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.57 కు పెరగగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.45 కి చేరింది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.19 కి చేరగా.. డీజిల్ ధర రూ. 99.14గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.87లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.99.77గా ఉంది.

Also Read:

Amazon Great Indian: ప్రైమ్‌ మెంబర్స్‌కు ఆఫర్ల పండుగ ఒకరోజు ముందే ప్రారంభమైంది.. ఈ భారీ డిస్కౌంట్లను గమనించారా?

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో రూ.50 వేలు డిపాజిట్‌ చేస్తే.. రూ.3,300 పెన్షన్‌..!

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై