Kondapolam: వివాదంలో వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమా.. హీరో పేరును తప్పుబడుతూ..

మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కొండపొలం. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‏గా

Kondapolam: వివాదంలో వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమా.. హీరో పేరును తప్పుబడుతూ..
Konda polam
Follow us
Rajitha Chanti

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 02, 2021 | 3:01 PM

మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కొండపొలం. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేస్తున్న అక్టోబర్ 8న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ఇప్పుడు చిక్కుల్లో పడింది. సినిమాలో హీరో పేరులో యాదవ్‏ను చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కురుమ/కురువల కులవృత్తి నేపథ్యంలో సినిమా తీసి యాదవ్ అని ఎలా పెడతారంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్‏లోని ప్రెస్ క్లబ్‏లో పాలమూరు కురవ సంఘం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. హైదరాబాద్ పాలమూరు కురువ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శంకరోళ్ల రవి కుమార్ మాట్లాడుతూ.. కురుమ వృత్తి ఆధారంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తీసిన సినిమా కొండపొలం. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ రకుల్ ప్రీత్, మా కురుమ/ కురువ కులవృత్తి ఎదుర్కొంటున్న సమస్యలను బాగా తీశారని ట్రైలర్ చూస్తే తెలిసిందని చెప్పుకొచ్చారు. అంతా బాగా తీసిన సినిమా బృందానికి కృతజ్ఞతలు. అయితే లీడ్ రోల్ హీరో పేరు కటారు రవీంద్ర యాదవ్ అని పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. యాదవులు అంటే గొర్రెలు కాకుండా గేదెలు, ఇతర పశువులు కాస్తారు. కురుమ, కురువలు మాత్రమే గొర్రెలు కాస్తారు. యాదవులు BC-Dలో ఉంటారు. కురుమలు ఇంకా వెనకబడిన వర్గానికి చెంది BC-B కిందకు వస్తాం. మా పేరు చివర కురుమ అని పెట్టుకుంటాం. యాదవుల కుల దైవం మల్లన్న, కురుమల కుల దైవం బీరప్ప, ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు కోటి మంది కురుమలు ఉన్నారు. కోటి మంది మనోభావాలను దెబ్బతీసినట్లు హీరో పేరు ఉంది. మా కురుమ/ కురువల అస్తిత్వం దెబ్బతిసేలా పేరు పెట్టారు. ఒక సామాజిక వర్గం అస్తిత్వాన్ని ప్రశ్నించేలా ఉంది. హీరో పేరును మార్చి సినిమా విడుదల చేయాలి. యాదవ్ అనే పదాన్ని తొలగించిన మాకు అభ్యంతరం లేదు. పేరు మార్చకుండా సినిమా విడుదల చేస్తే మా నిరసన తెలియజేస్తాం. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ఆందోళన చేస్తాం, హీరో పేరులో యాదవ్ పదాన్ని తొలగించి కురుమ చేర్చాలని డిమాండ్ చేశారు.

Also Read: Maa Elections 2021: ఉదయాన్నే మేనిఫెస్టో ప్రకటన.. అనుహ్యంగా ఎన్నికల నుంచి తప్పుకున్న సీవీఎల్..

Kannada Tv Actress Soujanya: యువనటి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్.. ప్రియుడిపై తండ్రి ఫిర్యాదు..