Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannada Tv Actress Soujanya: యువనటి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్.. ప్రియుడిపై తండ్రి ఫిర్యాదు..

కన్నడ బుల్లితెర యువనటి సౌజన్య ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. రోజు రోజు వరుస ట్విస్టులతో కేసు మలుపు

Kannada Tv Actress Soujanya: యువనటి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్.. ప్రియుడిపై తండ్రి ఫిర్యాదు..
Soujanya's
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 02, 2021 | 12:53 PM

కన్నడ బుల్లితెర యువనటి సౌజన్య ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. రోజు రోజు వరుస ట్విస్టులతో కేసు మలుపు తిరుగుతుంది. ఇక సౌజన్య ఆత్మహత్య కేసు తిరిగి ఆమె ప్రియుడుకే చుట్టుకుంటుంది. నటుడు వివేక్.. ప్రేమ, పెళ్లి పేరుతో వేధించడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని.. ఆమె తండ్రి ప్రభు మాదప్ప ఆరోపించాడు. నటుడు వివేక్, అసిస్టెంట్ మహేష్‏లపై కంబళగోడు పోలీస్ స్టేషన్‏లో ఫిర్యాదు చేశాడు నటి సౌజన్య తండ్రి. అంతేకాకుండా.. తన కూతురు అమాయకురాలు అని.. ఎలాంటి తప్పు చేయలేదని ఫిర్యాదులో పేర్కో్న్నాడు.

తన కూతురు దగ్గర ఉన్న బంగారం, డబ్బులు కనిపించడం లేదని.. తెలిపాడు.. అలాగే.. ఒకవేళ తన కూతురు నిజాంగానే ఆత్మహత్య చేసుకుంటే.. మహేష్ అక్కడే ఉండకుండా ఎందుకు పారిపోయాడని.. తన కూతురు మృతదేహం వద్ద ఎందుకు ఉండలేదని ప్రశ్నించారు. అలాగే తన కూతురు ఫోన్ కూడా కనిపించడం లేదని.. ఫోన్ దొరికితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. దీంతో కుంపలగోడు పోలీసులు సౌజన్య తల్లిదండ్రుల సమక్షంలో ఆమె నివసించే అపార్ట్‏మెంట్ మొత్తాన్ని మరోసారి తనిఖీ చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్ట్‏మార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇక ఈ ఆరోపణలపై స్పందించిన నటుడు వివేక్..తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానమివ్వడానికి పోస్ట్ మార్టం నివేదిక కోసం చూస్తున్నానని ఎదురుచూస్తున్నానని చెప్పారు. నేను ఇప్పుడు ఏమి చెప్పను.. నాకు సౌజన్య ఒక సంవత్సరానికి పైగా తెలుసు. ఆమె బాధపడినప్పుడల్లా నన్ను కలిసేది. తను చాలా అమాయకురాలు అంటూ చెప్పుకొచ్చాడు వివేక్.. కర్ణాటక హోంమంత్రి అరగా జ్ఞానేంద్ర ఈ కేసుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కర్ణాటకలోని పొరుగున ఉన్న రాంనగర్ జిల్లాలోని బెంగళూరు శివార్లలోని దొడ్డబెలె గ్రామ సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో సౌజన్య గురువారం శవమై కనిపించింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె నాలుగు పేజీల సూసైడ్ నోటి రాసింది. అందులో తన మానసిక స్థితి బాగలేదని.. ప్రస్తుతం ఒత్తిడి తాను భరించలేకున్నాను అని పేర్కోంది. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

Also Read: Aamir Khan: చిక్కుల్లో అమీర్.. మండిపడుతున్న నెటిజన్స్… క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్.. ఇంతకీ ఏం జరిగిందంటే..