AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha – Naga Chaitanya: ఉత్కంఠకు తెర.. సమంత- నాగచైతన్య విడాకులు.. అధికారిక ప్రకటన

గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న గాలి వార్తలే నిజమయ్యాయి. టాలీవుడ్ సెలబ్రిటీ జంట సమంత, అక్కినేని నాగచైతన్య వేరుకుంపటి పెట్టుకునేందుకు నిర్ణయించుకున్నారు.

Samantha - Naga Chaitanya: ఉత్కంఠకు తెర.. సమంత- నాగచైతన్య విడాకులు.. అధికారిక ప్రకటన
Samantha, Naga Chaithanya
Rajeev Rayala
|

Updated on: Oct 02, 2021 | 4:43 PM

Share

Samantha – Naga Chaitanya: గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న గాలి వార్తలే నిజమయ్యాయి. టాలీవుడ్ సెలబ్రిటీ జంట సమంత, అక్కినేని నాగచైతన్య వేరుకుంపటి పెట్టుకునేందుకు నిర్ణయించుకున్నారు. విడాకులు తీసుకుంటున్నట్టు ఇద్దరు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో  ప్రకటించారు.

“చాలా రోజులు చర్చించిన తర్వాత భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. దశాబ్ద కాలంగా మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని అదృష్టంగా భావిస్తున్నాం. మా మధ్య ఉన్న స్నేహం చాలా ప్రత్యేకమైంది. ఇలాంటి కఠిన సమయంలో మమ్మల్ని అర్థం చేసుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియాను కోరుతున్నాం” అని వెల్లడించారు చైతూ, సామ్.

చైతూ – సమంత విడాకుల నిర్ణయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడినట్లు చాలా కాలంగానే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికలపై సమంత తన పేరు వెనుక అక్కినేని సర్ నేమ్‌ను తొలగించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. సమంత నిర్ణయం ఇటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు అటు సినీ అభిమానుల మధ్య చర్చనీయాంశమయ్యింది. అప్పటి నుంచే సమంత – చైతూల మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న ప్రచారం గుప్పుమంది. సమంత, నాగ చైతన్యల మధ్య వివాహ బంధం బీటలువారిందన్న ప్రచారం సోషల్ మీడియాలోనూ జోరుగా సాగుతోంది.

మొన్నటికి మొన్న చైతూ లేకుండా తన ఫ్రెండ్స్‌తో కలిసి గోవాకు వెళ్లిన సామ్.. వారితో కలిసి అక్కడ తెగ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత రెండు మాసాలగా చైతూ ఫోటోలు ఏవీ సమంత షేర్ చేయకపోవడం.. మొన్నటికి మొన్న చైతూ లేకుండా ఫ్రెండ్స్‌తో కలిసి సమంత గోవా ట్రిప్‌కు వెళ్లడంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందన్న వార్తలకు మరింత ఊతమిచ్చింది. ఇటీవల అక్కినేని నాగార్జున బర్త్ డే వేడుకలకు సమంత హాజరుకాకపోవడానికి కారణం ఇదేనని మీడియా వర్గాలు తేల్చేశాయి. అయితే దీనిపై ఇటు సమంత, అటు చైతూ లేదా నాగార్జున ఫ్యామిలీ నుంచి ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. మొన్న ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రిస్ట్రిక్షన్‌లో ఉండటం తనకు ఇష్టముండదని సమంత చేసిన వ్యాఖ్యలు ఆసక్తిరేకెత్తించాయి. అక్కినేని ఫ్యామిలీపైనే సమంత ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఆప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

View this post on Instagram

A post shared by S (@samantharuthprabhuoffl)

ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది..? నాగ చైతన్య, సమంత ప్రేమించి 2017లో పెళ్లి చేసుకున్నారు. వచ్చే నెల(అక్టోబర్) 7కు వారిద్దరి మధ్య వివాహ బంధానికి నాలుగేళ్లు పూర్తవుతాయి. పెళ్లి తర్వాత కూడా సమంతకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇటు వరుస సినిమాలు.. అటు వెబ్ సిరీస్‌లతో చాలా బిజీ అయ్యారు. ఓ రకంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సమంత కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. వారిద్దరు వేరుకుంపటి పెట్టుకోవాలని నిర్ణయించుకున్న వార్త ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురిచేస్తోంది. ఇద్దరి మధ్య ఎక్కడ చెడిందన్న అంశంపై చర్చించుకుంటున్నారు.

పెళ్లి తర్వాత కూడా సమంత బోల్డ్ రోల్స్ చేయడమే వివాదానికి కారణంగా తెలుస్తోంది. అక్కినేని కుటుంబం అలాంటి పాత్రలు చేయొద్దని చెప్పినా.. సమంత వారి మాటను లెక్కచేయలేదని తెలుస్తోంది. నా లైఫ్.. నా ఇష్టమన్నట్లు సమంత ధోరణి ఉండటంతో ఇష్యూ పెద్దదై చివరకు విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. ది ఫ్యామిలీ మ్యాన్‌ 2‌తో పాటు వెబ్ సిరీస్‌‌లలోనూ సమంత బోల్డ్ రోల్స్ చేయడంపై అక్కినేని కుటుంబీకులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే అక్కినేని కుటుంబం రిస్ట్రిక్షన్స్‌ను బేఖాతరు చేస్తూ సమంత ముందుకెళ్లడంతో వ్యవహారం ముదిరినట్లు సమాచారం.

Also Read:  రోజుకో ట్విస్ట్.. ఉత్కంఠగా మారిన ‘మా’ ఎన్నికలు.. వేడెక్కిన రాజకీయం

తవ్వుతున్న కొద్దీ కదులుతున్న డొంక.. మాట్రిమోనీ మోసగాడి వలలో ఎందరో యువతులు..