AR Murugadoss :ఆ టాలీవుడ్ స్టార్ హీరో కోసం అదిరిపోయే కథను సిద్ధం చేస్తున్న మురగదాస్..

సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లో మురగదాస్ ఒకరు. అద్బుతమైన కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ మంచి విజయాలను అనుకున్నారు మురగదాస్.

AR Murugadoss :ఆ టాలీవుడ్ స్టార్ హీరో కోసం అదిరిపోయే కథను సిద్ధం చేస్తున్న మురగదాస్..
Murugadoss
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 02, 2021 | 4:43 PM

AR Murugadoss : సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్‌లో మురగదాస్ ఒకరు. అద్బుతమైన కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ మంచి విజయాలను అనుకున్నారు మురగదాస్. చివరగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్భార్ సినిమాను తెరకెక్కించారు మురగదాస్. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మురగదాస్ ఎవరిని డైరెక్ట్ చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో మురగదాస్ ఓటాలీవుడ్ స్టార్ హీరోను డైరెక్ట్  వినిపిస్తున్నాయి. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో మురగదాస్ సినిమా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరి కమిబినేషన్ లో గతంలో స్పైడర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో ఇప్పుడు మహేష్ బాబుతో మరో సినిమా చేయాలనీ మురగదాస్ చూస్తున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో స్టార్ హీరో పేరు వినిపిస్తుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మురగదాస్ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. పుష్ప సినిమా తర్వాత బన్నీ మురగదాస్ సినిమా చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే మురగదాస్ బన్నీకి స్టోరీ లైన్ వినిపించారని తెలుస్తుంది. స్టోరీ లైన్ నచ్చడంతో బన్నీకూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. మరో ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక బన్నీ నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమాను ముందుగా చెప్పినట్టే డిసెంబర్ 17న థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈసినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Maa Elections 2021: హోరాహోరీగా ఎన్నికలప్రచారాలు.. సీన్లోకి హీరోయిన్ పూనమ్ కౌర్.. అన్నీ విషయాలు బయటపెడతానంటూ..

Kondapolam: వివాదంలో వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమా.. హీరో పేరును తప్పుబడుతూ..

Ravi Teja: జోష్‌ మీదున్న మాస్‌ మహా రాజా… మరో ప్రాజెక్ట్‌ ప్రకటన. ఒకేసారి మూడు సినిమాలతో.