AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోమ‌లి ప్ర‌సాద్ కొత్త సినిమా.. త‌మిళం ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న అందాల భామ

కోమ‌లి ప్రసాద్ ప్ర‌ధాన పాత్ర‌లో శ‌ర‌ణ్ రాజ్ సెంథిల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప‌వ‌ర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూప‌ర్ నేచుర‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘మండవెట్టి’. ఈ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. ప‌వ‌ర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూప‌ర్ నేచుర‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది

కోమ‌లి ప్ర‌సాద్ కొత్త సినిమా.. త‌మిళం ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న అందాల భామ
Komalee Prasad
Rajeev Rayala
|

Updated on: Jan 30, 2026 | 2:32 PM

Share

హీరోయిన్ కోమ‌లి ప్ర‌సాద్ త‌న ‘మండవెట్టి’ చిత్రంతో త‌మిళంలో ఎంట్రీ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇది ప‌వ‌ర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూప‌ర్ నేచుర‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోంది. ఆమె సినీ కెరీర్‌లో ఇదొక ముఖ్య‌మైన, కొత్త చాప్ట‌ర్‌. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ప్రేక్ష‌కుల ప్రేమ‌, ఆశీస్సులు కావాల‌ని కోరుతూ కోమ‌లి మ‌న‌స్ఫూర్తిగా కోరుకున్నారు. ‘మండ‌వెట్టి’ సినిమాను ప్రారంభించ‌టం త‌మ‌కెంతో గర్వంగా ఉంద‌ని చెప్పిన చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన విష‌యాల‌ను బయటపెట్టలేదు. ట‌స్క‌ర్స్ డెన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై శ‌ర‌ణ్ రాజ్ సెంథిల్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మండ‌వెట్టి మూవీ టీమ్‌ లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి షూటింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. చిత్రంలోని న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు న‌ట‌కు ప్రాధాన్య‌మున్న ఈ క‌థ‌కు తెర‌పై జీవం పోయ‌టానికి శ్ర‌మిస్తున్నారు.

అన్నం బదులు అందం తింటుందా..!! సీరియల్‌లో సైడ్ యాక్టర్.. కానీ సినిమా హీరోయిన్లు కూడా పనికిరారు..

‘మండ‌వెట్టి’తో కోమ‌లి ప్ర‌సాద్ త‌న‌ సినీ కెరీర్‌లో కొత్త భాష‌, కొత్త సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. సూప‌ర్ నేచుర‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ అంశాల‌తో పాటు మిస్టిసిజం, ఎమోష‌న్స్ క‌ల‌యిక‌గా ఓ మ‌హిళ ప్ర‌ధానమైన క‌థ‌తో సినిమా తెర‌కెక్కుతోంది. మ‌న‌కు కావాల్సిన దాన్ని కోల్పోవ‌టం కలిగే బాధ‌, గుర్తింపు, జీవ‌న పోరాటం, వంటి అంశాలను మిళితం చేసి పెర్ఫామ‌న్స్‌కు స్కోప్ ఉన్న క‌థ‌ను రూపొందించారు . పెర్ఫామెన్స్‌తో పాటు భావోద్వేగానికి ప్రాధాన్య‌మున్న ఈ క‌థంతా కోమ‌లి ప్ర‌సాద్ ప్ర‌ధానంగా సాగుతుంది.

గోడకేసి కొట్టి, కటింగ్ ప్లేయర్‌తో మంగళసూత్రం తెంచాడు.. సింగర్ కౌసల్య జీవితంలో ఇంత విషాదమా..

‘వెల్ల కుదిర’వంటి సెన్సిబుల్‌, సైక‌లాజిక‌ల్ మూవీని రూపొందించి ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న డైరెక్ట‌ర్ శ‌ర‌ణ్‌రాజ్ సెంథిల్ కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా, భావోద్వేగాలు ప్ర‌ధానంగా మండ‌వెట్టి సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా విష‌యంలో ఆయ‌న ఎమోష‌న్స్‌, పాత్రల అంతర్గతభావాల‌పై పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మూవీలో అంశాలు కేవ‌లం ప్రేక్ష‌కులు చూడ‌టానికే కాదు..పాత్ర‌ల్లోని భావోద్వేగాలు ప్ర‌తిబింబంగా మెప్పించ‌నున్నాయి. ఈ సినిమాలో ఇంకా తేన‌ప్ప‌న్‌, గ‌జ‌రాజ్‌, అమృత స‌హాయ‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. వీరి న‌ట‌న క‌థ‌లోని ఎమోష‌న్స్‌కు మ‌రింత బాల‌న్ని తీసుకురానున్నాయి. కోమలీ ప్రసాద్ కెరీర్‌లో ఈ తమిళ సినిమా ఒక కీలకమైన అడుగు. ప్రారంభం నుంచే ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా భావోద్వేగాలు ఉన్న పాత్రలకే ఆమె ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఇప్పటివరకు ఆమె తెలుగు ఆడియెన్స్‌ను నెపోలియన్, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ P.C. 524, హిట్ – సెకండ్ కేస్, హిట్ – థర్డ్ కేస్, శశివదనే చితాల‌తో ఆక‌ట్టుకుంద‌ది. అలాగే డిజిటల్ మాధ్య‌మాల్లోనూ లూజర్ , మోడర్న్ లవ్ హైదరాబాద్, టచ్ మీ నాట్ లాంటి సిరీస్‌ల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది.

ఇవి కూడా చదవండి

చూడటానికి పెద్ద అంకుల్.. కానీ నాతో అలా చేశాడు.. షాకింగ్ విషయం చెప్పిన యాంకర్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..