AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోడకేసి కొట్టి, కటింగ్ ప్లేయర్‌తో మంగళసూత్రం తెంచాడు.. సింగర్ కౌసల్య జీవితంలో ఇంత విషాదమా..

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించి ప్రేక్షకులను అలరించారు సింగర్ కౌసల్య. ఎనో మెలోడీస్ పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే మాస్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఉర్రుతలూగించారు కౌసల్య. కానీ కౌసల్య జీవితంలో ఎంతో విషాదం ఉంది. ఆమె మాజీ భర్త చేతిలో నరకం చూసింది.

గోడకేసి కొట్టి, కటింగ్ ప్లేయర్‌తో మంగళసూత్రం తెంచాడు.. సింగర్ కౌసల్య జీవితంలో ఇంత విషాదమా..
Singer Kousalya
Rajeev Rayala
|

Updated on: Jan 29, 2026 | 9:11 AM

Share

ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు సింగర్ కౌసల్య. నీకోసం సినిమాతో సింగర్ గా మారిపోయింది కౌసల్య. తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు కౌసల్య. ఆమె పాడిన పాటల్లో రా..రమ్మని రారా రమ్మని, లంచ్‌కొస్తావా.. మంచుకొస్తావా , వల్లంకి పిట్టా.. వల్లంకి పిట్టా.. లాంటి 300 పాటలు పాడారు. సత్యభామలో ‘గుండెలోన’ అనే పాటకు నంది అవార్డు వచ్చింది. దివంగత సంగీత దర్శకుడు చక్రి సారథ్యంలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు కౌసల్య. సింగర్ గా ఎంతో స్టార్ డమ్ సొంతం చేసుకున్న కౌసల్య జీవితంలో ఎంతో విషాదం కూడా ఉంది. ప్రస్తుతం సింగర్ కౌసల్య సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ కనిపించడం లేదు . ఆమె గాత్రాన్ని అభిమానులు ఎంతో మిస్ అవుతున్నారు.

రెండే రెండు సినిమాలు.. ఒకటి హిట్ రెండోది డిజాస్టర్..! ఒకోక్క మూవీకి రూ.7కోట్లు అందుకుంటున్న బ్యూటీ

కాగా కౌసల్య గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆమె తన విడాకుల గురించి, మాజీ భర్త నుంచి ఎదుర్కొన్న గృహహింస గురించి వెల్లడించారు. తాను ఆరు సంవత్సరాలకు పైగా అబ్యూసివ్ సంబంధంలో ఉన్నానని, అందుకు ప్రధాన కారణం తన తల్లిదండ్రులు, చెల్లి, అలాగే సమాజంలో సెలబ్రిటీగా తన ప్రతిష్టకు చెడ్డ పేరు వస్తుందన్న భయమేనని తెలిపారు. విడాకులు తీసుకుంటే సమాజం, మీడియాలో వచ్చే వార్తలకు భయపడినట్లు ఆమె పేర్కొన్నారు. తన భర్తనే మొదట కోర్టులో కంజూగల్ రైట్స్ కోసం కేసు వేసి, తన భార్య తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ఆరోపించాడని, అయితే నిజానికి తనే ఆమెను ఇంటి నుండి వెళ్ళిపొమ్మని చెప్పాడని కౌసల్య స్పష్టం చేశారు.

నా కూతురికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బ్రతిమిలాడా..! మూగ అమ్మాయి సినిమాల్లోకా అని అవమానించారు

కౌన్సెలింగ్‌లో తనపై నిరాధార ఆరోపణలు చేశాడని కౌసల్య తెలిపారు. దీపావళి రోజుల్లో తరచుగా గొడవలు, శారీరక దాడులు జరిగేవని, ఒక దీపావళి రోజు తన చేయి మెలిపెట్టాడని, మరొకసారి తన పెద్దల సమక్షంలో గోడకేసి కొట్టగా తీవ్ర గాయాలయ్యాయని, కన్ను పోయేంత పని జరిగిందని కౌసల్య వివరించారు. ఆ సమయంలో ఓ స్నేహితుడు రక్షించాడని చెప్పారు కౌసల్య. అలాగే తన మాజీ భర్తకు మరో మహిళతో సంబంధం ఉందని, వారికి ఒక పాప కూడా ఉందని తనకు తెలిసిందని కౌసల్య తెలిపారు. తన కొడుకు ఒక దీపావళి రోజున తన తండ్రిని మరో మహిళతో చూసి తీవ్రంగా బాధపడ్డాడని, ఆ సంఘటన తనను మరింత బలంగా మార్చిందని చెప్పారు. తన కొడుకు భవిష్యత్తు కోసమే తాను ఈ పోరాటం చేస్తున్నానని తెలిపారు. తన మాజీ భర్త తన పేరు మీద ఉన్న ఇంటిని మోసం చేసి అప్పులు చేశాడని, మంగళసూత్రం, మెట్టెలు కటింగ్ ప్లేయర్‌తో తెంచి తీసుకెళ్ళాడని కౌసల్య ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 498 కేసు పెట్టి అరెస్ట్ అయిన తర్వాత కూడా తన భర్త తీరు మారలేదని, తర్వాత తనను, తన కొడుకును చంపుతామని బెదిరింపులు కూడా వచ్చాయని తెలిపారు. ఈ బెదిరింపులు రావడంతోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రయాణంలో న్యాయవాదుల వద్ద కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. ఇప్పుడు ఇలా..! ఈ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గుర్తుందా..?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..