ఒకే ఒక్క సాంగ్ వల్ల సినిమా ఏకంగా 365 రోజులు ఆడింది.. పాట కోసమే ఆడియన్స్ థియేటర్స్ వెళ్లేవారట
సాధారణంగా గ్లామర్ పాటలకు సినీరంగంలో ప్రత్యేకమైన వైబ్ ఉంటుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ.. ఇలా భాషతో సంబంధం లేకుండా యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన సాంగ్స్ చాలా ఉన్నాయి. సినిమాలే కాదు కొన్ని పాటలు కూడా పేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. సినిమాల సంగతి పక్కన పెడితే పాటలు మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పుడు సినిమాలు నెల రోజులు థియేటర్స్ లో ఆడటం అనేది చాలా పెద్ద విషయం.. ఒకప్పుడు సినిమాలు 50 రోజులు, 100 రోజులు, 175 రోజులు కూడా థియేటర్స్ లో ఆడేవి. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు 100రోజులకు పైగా థియేటర్స్ లో ఆడి రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అలాగే సినిమాల్లో సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచేవి. అయితే కొన్ని సాంగ్ వల్ల సినిమా 100 రోజులకు పైగా ఆడిన మూవీస్ కూడా ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్న సినిమా కూడా అదే లిస్ట్ లోకి వస్తుంది. ఆ సినిమా ఎదో కాదు మాయలోడు సినిమా. నటకిరీటి రాజేంద్రప్రసాద్, సౌందర్య కలిసి నటించిన ఈ సినిమాకు ఎస్వీ కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో బాబు మోహన్ సౌందర్యతో కలిసి చేసిన సాంగ్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.
ప్రముఖ నటుడు బాబు మోహన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన కెరీర్‌లో దాదాపు 250 పాటల్లో నటించినట్లు ఆయన పేర్కొన్నారు. రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు వంటి చిత్రాల నుంచి తన పాటల యుగం మొదలైందని ఆయన తెలిపారు. సిల్క్ స్మిత, డిస్కో శాంతి, జయలలిత, పాకీజా వంటి నటీమణులతో పాటు, ప్రపంచ సుందరి సోను వాలియాతో కూడా బొలె బొలె బొలియా ఓ సుందరి వంటి హిట్ పాటల్లో నటించానని ఆయన గుర్తు చేసుకున్నారు. డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ తన పాటల ద్వారానే గుర్తింపు పొందారని, ముఖ్యంగా అక్కుం బక్కుం చిత్రంలోని పాట తనకు మంచి పేరు తెచ్చిందని బాబు మోహన్ తెలిపారు.
తన పాటలు సినిమా విజయానికి ఎంతగానో దోహదపడ్డాయని ఆయన పేర్కొన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా, దివంగత నటి సౌందర్యతో కలిసి తాను నటించిన పాట గురించి బాబు మోహన్ సంచలన విషయాలు వెల్లడించారు. ఆ పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్‌గా నిలిచిందని, ఆ సినిమా ఒకే థియేటర్‌లో, శ్రీనివాసలో 365 రోజుల పాటు నిరంతరాయంగా ప్రదర్శించారని ఆయన తెలిపారు. 365వ రోజు రెండో షో కూడా హౌస్‌ఫుల్ అయ్యిందని, అది మామూలు విషయం కాదని బాబు మోహన్ అన్నారు. సినిమా విడుదలైన 365వ రోజు థియేటర్ మేనేజర్‌ను అడగ్గా, మరుసటి రోజు సినిమా తీసివేస్తున్నామని, ఎందుకంటే కొన్ని కమిట్‌మెంట్లు ఉన్నాయని మేనేజర్ చెప్పారు. లేకపోతే ఇంకా ఆడేది ఆ సినిమా. ఆ రోజు లోపలికి వెళ్లి చూస్తే థియేటర్ సగం మాత్రమే నిండి ఉందని, బయట మాత్రం “హౌస్ ఫుల్ ” బోర్డు ఉంది. ఇదేంటి అని మేనేజర్ ను అడగ్గా, రెండు నిమిషాలు ఆగమని చెప్పారని .. సరిగ్గా తన పాట సమయంలో థియేటర్ కిక్కిరిసిపోయిందని, బయట కూడా ప్రేక్షకులు ఉన్నారని.. సాంగ్ వస్తుంటే పూలు, డబ్బులు విసిరారని బాబు మోహన్ తెలిపారు. కొంతమంది సినిమా మొత్తం చూడకుండా పాట సమయంలో మాత్రమే థియేటర్‌కు వచ్చి చూసి వెళ్ళేవారని మేనేజర్ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. నడుస్తుందని ఆయన ప్రతిన బూనారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




